రైలు కింద పడి మరణించిన స్టార్ హీరోయిన్ తమ్ముడు.. ఎలాగంటే..

ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి కవిత. ఈమె ‘జగన్మోహిని’ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యి ఎన్నో హిట్ సినిమాలో నటించారు. సినిమాల పరంగా ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న కవిత తన వ్యక్తిగత జీవితంలో తమ్ముడుని కోల్పోయి ఒక చేదు అనుభవాని చవిచూసింది. మంచి భవిష్యత్తు ఉన్న ఆమె తమ్ముడు అర్ధాంతరంగా కన్నుమూయడం తన జీవితంలో తీరని లోటు అని కవిత చెబుతున్నారు. అలానే ఇంకో బాధకరమైన విషయం ఏంటంటే కవిత తమ్ముడు చనిపోయిన సమయంలోనే అల్లు రామలింగయ్య చిన్న కుమారుడు కూడా మరణించాడు.

అల్లు అరవింద్ తమ్ముడు, కవిత తమ్ముడు ఇద్దరు మంచి స్నేహితులు అనే విషయం చాలా తక్కువమందికి తెలిసిన విషయం. ఎక్కడికి వెళ్లిన ఇద్దరూ కలిసే వెళ్లేవారు. అయితే ఒకరోజు వారిద్దరూ సరదాగా ఎలక్ట్రిక్ ట్రైన్ ఎక్కుదాం అని బయటికి వెళ్లారు. సరదాగా ఎంజాయ్ చేద్దామని బయటికి వెళ్ళిన వాళ్లిదరు మృతదేహాలు మారారు. అప్పట్లో ఎలక్ట్రిక్ ట్రైన్స్ గురించి ఎవరికి పెద్దగా అవగాహన లేదు. ఆ ట్రైన్ ఎలా ఎక్కలో కూడా కొంతమందికి తెలీదు. అలానే వారిద్దరికి కూడా ట్రైన్ ఎలా ఎక్కాలో సరిగా అవగాహన లేకపోవడంతో ట్రైన్ ఎక్కబోయి ఇద్దరు ఒకేసారి ట్రైన్ కింద పడి మరణించారు.

దాంతో ఇరు కుటుంబాలలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ విషాద సంఘటన తెలిసి ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. దాంతో ఆ రోజుని బ్లాక్ డేగా ప్రకటించారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న కవిత తమ్ముడు సడన్ గా మరణించడంతో ఆమె ఏడాదిపాటు ఆ షాక్ నుండి తెరుకోలేకపోయింది. తన తమ్ముడినే తలచుకుంటూ ఎపుడూ ఒక గదిలో ఉండేదట. ఆ సమయంలో కవితను మామూలు మనిషిని చేయడానికి ఆమె తల్లి ఎంతగానో ప్రయత్నించారట. కవిత మెంటల్‌గా డిప్రెషన్ లోకి వెళ్లడమే కాకుండా పిచ్చిపిచ్చిగా చేసేవారట. ఆ తరువాత కొన్నాళకు కవిత కోలుకొని సినిమాలో బీజీ అయిపోయింది. అలా తన తమ్ముడి మరణం ఆమె జీవితంలో తీరని లోటు అంటూ కవిత తన జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన గురించి అభిమానులతో పంచుకున్నారు.