‘వీర సింహారెడ్డి’ మేకింగ్ వీడియో.. బాల‌య్య ర‌చ్చ‌, చిలిపి శృతి… మోక్ష‌జ్ఞ చార్మింగ్ (వీడియో)

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ప‌క్క మాస్ ఫ్యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీర సింహారెడ్డి’. ఈ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నరు. ఈ ఫ్యాక్షన్ మాస్ సినిమాను 2023 సంక్రాంతి కాక‌నుగా జనవరి 12న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో బాలయ్య డ్యుయెల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్, సాంగ్స్‌తో ఈ సినిమా ఇప్ప‌టికే భారీ క్రేజ్‌ను సోంతం చేసుకున్నంది.

Latest: NBK107 is officially titled Veera Simha Reddy | 123telugu.com

ఈ క్ర‌మంలోనే ఈ రోజు ఈ సినిమా నుంచి ‘రోర్ ఆఫ్ వీర సింహారెడ్డి’ పేరుతో మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఈ సినిమాలోనీ కీలక ఘట్టాల షూటింగ్ ఏ విధంగా జ‌రుగుతుందో అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ పైట్ ఘట్టాలని ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ కంపోజ్ చేసిన తీరు అభిమానుల‌ను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

ఇక కల్యాణ మండపం సీన్ లో బాలయ్య విలన్ లకు వార్నింగ్ ఇస్తున్న తీరు ఈ సీన్ కు థ‌మన్ ఇచ్చిన‌ బీజీఎమ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ సినిమాకి షూటింగ్‌లో ఓ కీలక సెట్ లో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ మ‌రియు అయ‌న‌ కుమార్తెలు బ్రాహ్మిణి, తేజస్విని, కుమారుడు మోక్ష‌జ్ఞ‌ కూడా ఈ వీడియోలో సందడి చేశారు. బాలయ్యపై చిత్రీకరించిన పలు కీలక సన్నివేశాలలో వరలలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్ కూడా పాల్గొన్నారు. అయితే వారిద్దరూ ఓల్డ్ ఏజ్ గెటప్ లో కనిపించడం అందరిని ఆశ్చర్యాన్ని గురిచేసింది.The Making Video Balakrishna's 'Roar Of Veera Simha Reddy' Brings A Pleasant Surprise

బాలయ్య అఖండలాంటి సూపర్ హిట్ తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాని కూడా దర్శకుడు గోపీచంద్ మలినేని భారీ స్థాయిలోనే తెరకెక్కించినట్టుగా ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. అందులో ఓల్డ్ గెటప్ లో బాలయ్యను చూస్తుంటే ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకునే విధంగా బాలయ్య ఆదరగొడుతున్నాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని జనవరి 6న ఒంగోలులో భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఇదే వేదిక సాక్షిగా ‘వీర సింహారెడ్డి’ ట్రైలర్ ని కూడా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.