ఖుషి కథ చెప్పడానికి వెళితే… పవన్ అంత పని చేశాడా.. ఎస్‌జె.సూర్య షాకింగ్ కామెంట్స్‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమాలలో ఖుషి కూడా ఒకటి. ఇక ఈ సినిమా రిలీజ్ అయి 20 ఏళ్లు అయినా సందర్భంగా ఈరోజు న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాను మళ్ళీ రీలీజ్ చేశారు. పవర్ స్టార్ అభిమానులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లు ఊరెత్తిపోతున్నాయి. రీ రిలీజ్ కి ముందు నుంచే ఖుషి సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసింది.

ఈ క్రమంలోనే ఈ సినిమా దర్శకుడైన ఎస్ జె సూర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కోలీవుడ్ లో నేను తెరకెక్కించిన ‘వాలి’ హిట్ తరవాత నేను హైదరాబాద్ వచ్చిన సమయంలో ప్రొడ్యూసర్ ఎం. రత్నం పవన్ కళ్యాణ్ కి నన్ను పరిచయం చేశారు’. ‘ఆ సమయానికే బద్రి, తమ్ముడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఎంతో సింపుల్ గా చిన్నపిల్లాడిలా తన టేబుల్ పై కారు బొమ్మ పెట్టుకుని ఆడుకుంటూ ఉన్నాడు అంటూ సూర్య చెప్పుకొచ్చాడు’.

 If Khushi Goes To Tell The Story Pawan Did It Sj Surya , Khushi, Pawan , Sj Sur-TeluguStop.com

‘అన్ని ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇంత సింపుల్‌గా ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి నేను ఖుషి సినిమా స్టోరీ చెప్పాను’. ‘ఆ స్టోరీ ఆయనకు నచ్చింది. ఖుషి సినిమా తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో ఇంకో సినిమా చేయలేదనే బాధ ఉంది అంటూ ఎస్‌జేసూర్య ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడుస‌. ఇక ఖుషి సినిమా కాకుండా వీరి కాంబినేషన్‌లో కొమరం పులి అనే సినిమా కూడా వచ్చింది.

Will Pawan Kalyan fulfill his friend SJ Surya's political wish? |  cinejosh.com

జ‌ల్సా త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ప‌వ‌న్ ఈ సినిమా చేశాడు. 2010లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నికిషా ప‌టేల్ హీరోయిన్‌. అయితే ఈ యాక్షన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన‌ విజయం అందుకోలేక పోయింది. ఆ తర్వాత నుంచి వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఎస్ జె సూర్య యాక్టర్ గా కూడా బిజీగా ఉన్నాడు. ఎస్ జే సూర్య చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.