లిప్ లాక్ తో.. అధికారికంగా పెళ్లి ప్రకటన చేసిన నరేష్- పవిత్ర లోకేష్..!!

కొత్త ఏడాది కొత్తగా ప్రతి ఒక్కరూ స్వాగతం పలకాలని ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ సెలబ్రెటీల జీవితంలో మరికొన్ని ఆనందాలు కలగాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా సీనియర్ నటుడు వీకే నరేష్ ,పవిత్ర లోకేష్ గత కొద్దిరోజులుగా వైరల్ గా మారుతూనే ఉన్నారు. ముఖ్యంగా వీరి వైవాహిక జీవితం నుంచి ఎన్నో రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నరేష్ పవిత్ర ఇద్దరు కూడా గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారని విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. దీంతో నరేష్ మూడో భార్య రమ్య కూడా వీరిద్దరి పైన కేసు వేయడం జరిగింది.

Actor Naresh and Pavitra Lokesh Marriage Confirmed with Special Video -  Sakshi

అయితే ఇప్పుడు తాజాగా కొత్త ఏడాది స్వాగతం పలుకుతూ తమ బంధం గురించి ఓపెన్గా తెలియజేశారు. తమ బంధాన్ని రివిల్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. వీటితోపాటు కొత్త సంవత్సరం కొత్త ప్రారంచాలి మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ తమ రిలేషన్ గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీంతో పవిత్ర లోకేష్, నరేష్ అనుకున్నంత పని చేశారంటూ పలువురు నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక అంతే కాకుండా త్వరలోనే వివాహం చేసుకోబోతున్నామంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది.

దీంతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి కేక్ తినిపించుకుంటూ లిప్ లాక్ చేసుకోవడంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.. నరేష్ కు పవిత్ర లోకేష్ తో వివాహం జరిగితే ఇది నాలుగవ వివాహం అని చెప్పవచ్చు. మరి తమ వైవాహిక బంధం పైన ఎట్టకేలకు ఈ ఏడాది క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

https://twitter.com/ItsActorNaresh/status/1609067421507407873?s=20&t=iidP-7OgRu-XF3zQ5ikdJA