జబర్దస్త్‌ కోసం ఇంద్రజ, ఖుష్బులు ఎంత తీసుకుంటున్నారో తెలుసా?

బుల్లితెర షో జబర్దస్త్‌ గురించి ప్రత్యేకంగా జనాలకి పరిచయం చేయడానికి ఏమీ లేదు. అయితే ఇటీవలి కాలంలో ఈ షోలో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. మొదటి ఈ షోకి జడ్జీలుగా వ్యవహరించిన నాగబాబు, రోజాలు ఒకరి తరువాత ఒకరు బయటకు వచ్చేయడం జరిగింది. దాంతో ఇపుడు జబర్దస్త్‌ షోకి జడ్జీలుగా ఇంద్రజ, ఖుష్బులు వున్నారు. ఇక విషయానికొస్తే ఒకప్పుడు సినిమాలతో పోలిస్తే బుల్లితెర పై కనిపించే వారికి రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.

సినిమావాళ్ళకి ఏమాత్రం తీసిపోని విధంగా బుల్లితెరపై కనిపించేవాళ్ళు పారితోషికం అందుకుంటున్నారు. ఇక సదరు షో బాగా పాపులర్ అయితే పారితోషికం ఇంకా బాగా ఇస్తున్నారు. అందువల్లనే ఒకప్పుడు బుల్లి తెర అంటే చిన్నచూపు చూసే నటీమణులు నేడు బుల్లితెరపైన కనబడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్, అమితాబచ్చన్‌, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ మొదలుకొని ఎంతో మంది బుల్లి తెరపై సందడి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జ్‌ లుగా వ్యవహరిస్తున్న ఇంద్రజ మరియు కుష్బూ రెమ్యునరేషన్ ఇపుడు టాక్ అఫ్ ది టౌన్ అయింది. ఒక్కో షోకి వారి ఇరువురికీ లక్షల్లో ముట్టజెప్పుతున్నట్టు భోగట్టా. ఒకప్పుడు వీరు స్టార్ హీరోయిన్స్ అనే విషయం అందరికీ విదితమే. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఇంద్రజ పర్మినెంట్ మల్లెమాల షోలకు జడ్జ్ గా మారింది. అలాగే కుష్బూ కూడా అప్పుడప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూ వస్తుంది.