ఆ వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు..?

జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ..ఏ స్థాయిలో వైసీపీపై పోరాడుతుందో చెప్పాల్సిన పని లేదు..ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తుంది. ఎక్కడా కూడా తగ్గకుండా టీడీపీ ముందుకెళుతుంది. అటు జనసేన, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, కాంగ్రెస్, బీజేపీ సైతం..వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంది. వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం నాశనం అవుతుందనే విధంగా విమర్శలు చేస్తున్నారు.

అయితే విపక్ష పార్టీలు విమర్శలు చేస్తే ఒక అర్ధం ఉంది..కానీ సొంత పార్టీ వాళ్లే..తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో తమ ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు అసంతృప్తి గళం వినిపించారు. ఇక మొదట నుంచి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి..వైసీపీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కూడా రోడ్లపై గుంతలు పూడ్చలేదని, కొత్త ప్రాజెక్టులు కట్టలేదని, లే అవుట్లు ఇచ్చి..ఇళ్ళు కట్టలేకపోయామని విమర్శలు చేశారు. పెన్షన్లు ఇస్తే ఓట్లు వేసేస్తారా? అసలు ఏం చేశామని ప్రజలని ఓట్లు అడగాలని ప్రశ్నించారు.

అటు కొన్ని పెన్షన్లని తొలగించడంఒపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  అసంతృప్తి వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పింఛన్లు తొలగించిన తర్వాత గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ప్రజల మధ్యకు ఎలా వెళ్ళమంటారని నిలదీసిన పరిస్తితి. అటు సీనియర్ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి..ఈ స్థాయిలో విరుచుకుపడుతున్నారో చెప్పాల్సిన పని లేదు.

అయితే ఇలా సొంత ఎమ్మెల్యేలే విమర్శలు చేయడంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు..తాను కూడా ప్రభుత్వం చేస్తున్న తప్పులనే చెప్పానని, కానీ తనపైనే కక్ష కట్టారని, వేటు వేయాలని చూస్తున్నారని, మరి ఇప్పుడు ఆనం, కోటంరెడ్డిలపై వేటు వేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సొంత పార్టీ వాళ్లే..వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.