ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. జక్కన్న పుణ్యమాని తెలుగు సినిమా దిగాంతలకు చేరింది. ఈ క్రమంలో ఎప్పటినుండో ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ సినిమాలు ఈ సంవత్సరం చాలా రూపుదిద్దుకున్నాయి. కాగా దాదాపు అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 2022 ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది మల్టీస్టారర్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమాలు ఏవో అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాము.
ఇక్కడ ముందుగా RRR సినిమా గురించి మాట్లాడుకోవాలి. బాహుబలి తరువాత జక్కన్న చెక్కిన మరో కళాఖండం RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులతో సత్తా చాటింది. ఇంకా ఆ పరంపర కొనసాగుతూ వుంది. ఇక దీని తరువాత ‘భీమ్లా నాయక్’ సినిమా గురించి చెప్పుకోవాలి. ఆంధ్రుల ఆరాధ్యుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సూపర్ హిట్ అయింది.
ఇక వీటి తరువాత ఇక్కడ ప్రస్తావించదగ్గ చిత్రం గాడ్ ఫాదర్. తెలుగు తెర మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. కాగా ఇది మలయాళ సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఆఫీసియల్ రీమేక్ అన్న సంగతి విదితమే. దీని తరువాత f3 సినిమా గురించి యిక్కడ చెప్పుకోవాలి. ఎఫ్2కి సీక్వెల్ గా వచ్చిన ఎఫ్3 సినిమా సినిమా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించగా వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. కాగా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.