స్నేహం కోసమే ఆ పని చేయనున్న చిరంజీవి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. వచ్చే ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సంక్రాంతి బరిలో దిగబోతున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే యేడానికి చిరంజీవికి సంబంధించి రెండు చిత్రాలు విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాలు కాకుండా మరొక సినిమా కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Chiranjeevi: క్రేజీ న్యూస్.. చిరంజీవితో సినిమా ప్రకటించిన సీనియర్ హీరోయిన్,  బ్లాక్ బస్టర్ లోడింగ్

ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి స్నేహం కోసం ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు సమాచారం. రాధిక మరియు చిరంజీవి సుదీర్ఘకాలంగా సినిమాలలో నటించడమే కాకుండా వీరిద్దరూ మంచి స్నేహితులు అని చెప్పవచ్చు.! వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో చిత్రాలు విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. అప్పట్లో చిరంజీవి రాధిక కాంబినేషన్ హిట్ టాక్ పొందింది.

అయితే ఈసారి రాధిక మరియు చిరంజీవి జోడిగా కాకుండా చిరంజీవి హీరోగా రాధిక నిర్మాణంలో ఒక సినిమా రూపొందించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాధిక సొంత బ్యానర్ లోఈ చిత్రాన్ని నిర్మించేందుకు పలు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించి రెమ్యూనరేషన్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయాలు ఇంకా తెలియజేయలేదు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా పైన అప్డేట్ ప్రకటిస్తారమే చూడాలి మరి.