బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న అందాల భామల్లో కియారా అద్వానీ ఒకరు. తెలుగు వారికి సైతం ఈ అమ్మడు సుపరిచితమే. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ `భరత్ అనే నేను` సినిమాతో కియారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
తొలి సినిమాతోనే ఇక్కడ సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఈ భామ.. ఆ తర్వాత `వినయ విధేయ రామ`లో మెరిసింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
ఈ మూవీ అనంతరం కియారా టాలీవుడ్ లో కనిపించలేదు. బాలీవుడ్ కే పరిమితమైంది. అయితే చాలా కాలం తర్వాత తెలుగులో రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న `ఆర్సీ15`కి సైన్ చేసింది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తున్న కియారా.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు.
ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో మైండ్ బ్లాక్ చేసే కియారా.. తాజాగా రెడ్ డ్రెస్ లో స్పైసీ లుక్స్ తో కట్టిపడేసింది. కియారా లేటెస్ట్ హాట్ పిక్స్ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి. మరి లేటెందుకు వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.