అబ్బ‌బ్బా… ఈ హీరోయిన్ల‌కు హీరోల‌కు మించిన క్రేజ్ రా బాబు…!

సినిమా పరిశ్రమలో హీరోలదే పై చేయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడం కేవలం హీరోలకే సాధ్యం. అతికొద్దీ మంది దర్శకులు మాత్రమే హీరోలు- హీరోయిన్లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్ కి రప్పిస్తారు. హీరోయిన్ల‌లో కూడా కొందరు ఏ స్టార్ హీరో లేకుండా ప్రేక్షకులను థియేటర్ కు రప్పించగల దమ్ము ఉన్నవారు ఉన్నారు.

Anushka Shetty birthday: These photos of the Baahubali actress will leave you in awe of her beauty and style

మన సౌత్ స్టార్ హీరోయిన్స్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చాలామంది చేశారు. వారిలో అతి కొద్ది మందికి మాత్రమే విజయాలు అందాయి. మన తెలుగు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా మారింది. అరుంధతి సినిమా తర్వాత అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా తన స్టార్డం వ్యాల్యూతోనే విజయం అందుకుంటున్నాయి.

Happy birthday Nayanthara: 5 lesser known facts about the actress | Celebrities News – India TV

ఇక సౌత్ లేడీ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార కూడా స్టార్ హీరోలను మించి తన రేంజ్‌ను పెంచుకుంది. హీరోలతో సమానంగా తన సినిమాలకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సత్తా ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ అమ్మడు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం పిల్లలు యొక్క అలనా పాలనలో బిజీగా ఉన్న ఈ అమ్మడు ముందు ముందు మళ్ళీ బిజీ అవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

మరో స్టార్ హీరోయిన్ సమంత కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటుంది. రీసెంట్‌గా యశోద సినిమాతో తన స్టామినాను మరోసారి బాక్సాఫీస్ కు చూపించంది. ప్రస్తుతం మయో సిటీస్ అనే వ్యాధితో కొంత ఇబ్బంది పడుతున్న ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది. తన ఆరోగ్యం సెట్ అయిన వెంటనే మళ్ళీ వరుస‌ సినిమాలు చేస్తూ తన సత్తా చాటాలని ప్లాన్ చేస్తుంది.

ANUPAMA PARAMESWARAN ROPPED IN KEERTHY SURESH NEXT TAMIL FILM

మరో ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కి కూడా ఇదే స్థాయిలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు హీరోలతో సంబంధం లేకుండా తన ఫాలోయింగ్ పెంచుకుంది. హీరో కూడా లేకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించుకోగల స్థాయికి వెళ్ళింది అనుపమ. మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా అదే ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది. తెలుగులో వచ్చిన మహానటి సినిమాతో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ తర్వాత ఈమె చేసిన సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరిచాయి.

ఇక మరో స్టార్‌ హీరోయిన్ తమన్నా కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ప్రయత్నించినా కూడా జనాలు ఆమెను పట్టించుకోవడం లేదు. వీరు కాకుండా మరికొందరు ఇలా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ట్రై చేస్తున్నారు. కానీ వారిని ప్రేక్షకులు పట్టించుకునే స్థితిలో లేరు. కేవలం అనుష్క, సమంత, నయనతార, కీర్తి సురేష్ వంటి హీరోయిన్ల సినిమాలు మాత్రమే చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.