బ్రేకింగ్: బిగ్ బాస్ టాప్ – 3 కంటెస్టెంట్స్ వీళ్లే…!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కు మరి కొన్ని గంటల్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే గత రాత్రి శ్రీ సత్య ఎలిమినేట్ అవ్వగా చివరగా ఐదుగురు సభ్యులు మిగిలారు. ఈ సందర్భంలోనే బిగ్ బాస్ విన్నర్ ఎవరన్నా దానిపై సోషల్ మీడియాలో చర్చ విపరీతంగా నడుస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ భారీ అట్టర్ ప్లాఫ్ అన్న అభిప్రాయం ప్రేక్షకులలో ఉంది. అయితే ఇప్పుడు ఏ సీజన్లో లేనంతగా ఈ ఫినాలేకు పొలిటికల్ రంగు కూడా పులుముకుంది.

Bigg Boss Telugu 6 finale: 2 contestants to be removed from TOP 3

దానికి కారణం టాప్2 ప్లేస్ లో ఉండాల్సిన ఇనయాను కావాలనే ఎలిమినేట్ చేయడం, మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఫినాలేకు ఒక్కరోజు ముందు శ్రీ సత్యను ఎలిమినేట్ చేయడంపై ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. వీటికి తోడు పొలిటికల్ పవర్ తో రేవంత్‌ను విన్నర్ కాకుండా చూసేందుకు బిగ్ బాస్ లో కుట్రలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ 6 విన్నర్ ఎవరనే దానిపై హౌస్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సగటు ప్రేక్షకుడిలో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న అర్ధరాత్రితో బిగ్ బాస్ ఓటింగ్ లైన్స్ మొత్తం క్లోజ్ అవ్వగా.. విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న ఓటింగ్ సమాచారం ప్రకారం చివరి ప్లేస్ లో రోహిత్ నిలిచినట్టు తెలుస్తుంది. ఇక టాప్ 4లో కీర్తి ప్లేస్‌ దక్కించుకుంది.

Singer Revanth : Bigg Boss Season 6 Telugu Title is mine

టాప్3 లో ఆది రెడ్డి, రేవంత్, శ్రీహాన్, ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో అత్యధిక ఓట్లు సంపాదించుకున్న రేవంత్ ఈ సీజన్ విజేతగా నిలిచాడు. శ్రీహాన్ రన్నర్ గా సెకండ్ ప్లేస్‌ను దక్కించుకున్నాడు. కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆది రెడ్డి టాప్-3 తో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని నిమిషాలు వేచి చూడాల్సిందే.