అవతార్ 2.. తెలుగులో తొలి రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్ చిత్తు చిత్తు.. టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

 

అవ‌తార్ 2 – ద వే ఆఫ్ వాట‌ర్‌.. యావ‌త్ సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు డిసెంబ‌ర్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. 13 ఏళ్ల క్రితం వ‌చ్చి ఎన్నో సంచ‌ల‌న రికార్డుల‌ను నెల‌కొల్పిన దృశ్య‌కావ్యం `అవ‌తార్‌`కు ఇది సీక్వెల్‌. జేమ్స్ కేమరూన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సామ్ వర్థింగ్టన్, జో సల్దాన, సిగొర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లెట్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

భారీ అంచ‌నాలు న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంది. దీంతో తొలి రోజు తెలుగు రాష్ట్రల్లో ఊహకందని ఊచకోత కోసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చిత్తు చిత్తు చేసిందీ సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను ద‌క్కించుకుంది.

మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.8.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. చాలా ఏరియాల్లో రెంటల్ బేసిస్ మీద ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అందువ‌ల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ.5 కోట్ల రేంజ్ లో మాత్ర‌మే థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో రూ.5.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. తొలి రోజు వ‌సూళ్ల‌తోనే రూ.3.55 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది. ఇండియా వైడ్ గా అన్ని భాష‌ల్లో క‌లిపి రూ. 41.40 కోట్ల కి పైగా నెట్ కలెక్షన్స్ ను అందుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా అవ‌తార్ 2 టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం- 4.48 కోట్లు
సీడెడ్- 1.02 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.28 కోట్లు
ఈస్ట్+ వెస్ట్- 0.62 కోట్లు
కృష్ణా +గుంటూరు- 1.10 కోట్లు
నెల్లూరు- 0.30 కోట్లు
————————————
ఏపీ + తెలంగాణ= 8.80 కోట్లు
————————————