వావ్‌: అన్న‌ను మించిన త‌మ్ముళ్లు ఈ టాలీవుడ్‌ స్టార్ హీరోలు… !

ఏ రంగంలోనైనా ఒకరు విజయం సాధిస్తే వారి తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఆ రంగంలో అడుగుపెడతారు. ఇక సినిమా రంగంలో కూడా ఒక హీరో సక్సెస్ అయిన వెంటనే ఆ హీరో కుటుంబ సభ్యులు కొందరు సినిమా పరిశ్రమ లోకి వచ్చి సక్సెస్ అయిన వారు ఉన్నారు. అలా సినిమా రంగంలోకి వచ్చి వాళ్లకంటే ఎక్కువ సక్సెస్ పొందిన వారు వీళ్లే.

Jr. NTR's salute to half-brother Kalyan Ram: No one else can play Bimbisara

నందమూరి తారకరామారావు మూడో తరం నట వార‌సులుగా సినిమాల్లోకి వచ్చిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వారి వారసత్వాన్ని ముందుకు తీసుకు వెళ్తూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటిస్తున్నారు. వీరు తమ తాత పేరు నిలబెడుతున్నారు. అయితే వీళ్ళిద్దరిలో కళ్యాణ్ రామ్ కంటే జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలు అందుకుంటూ పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

Chiranjeevi and Pawan Kalyan face off again?

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో బడా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఎందరో హీరోలు వచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి ముందుగా చిరంజీవి వచ్చి టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఉన్నారు. తర్వాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి పవర్ స్టార్ అనే బిరుదుతో అన్నను మించిన విజయాలను దక్కించుకుని టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నరు. ఇటు రాజకీయాలలోనూ అటు సినిమాలలోనూ పవన్ కళ్యాణ్ తన హవా చూపిస్తున్నాడు.

I stand a few steps away in awe: Actor Suriya to brother Karthi on  'Kaashmora' | The News Minute

కోలీవుడ్‌లో స్టార్ హీరోలైన సూర్య, కార్తీక్ కూడా అన్నదమ్ములే. ముందుగా సూర్య సినిమాల్లోకి వచ్చి అగ్ర హీరోగా మంచి పేరును సంపాదించుకున్న తర్వాత. ఆయన తమ్ముడు కార్తీక్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కార్తీక్ సూర్య కంటే వరుస విజయాలు అందుకుంటూ కెరియర్ లో దూసుకుపోతున్నాడు.
గత కొంతకాలం నుంచి కార్తీక్ నటించిన సినిమాలన్నీ వరుస విజయాలను అందుకుంటున్నాయి.

Vaisshnav Tej about Sai Dharam Tej health : He will come back home in a week

మెగా ఫ్యామిలీ నుంచి మెగా మేనళ్లుల్లుగా సినిమాల్లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా వరుస సినిమాలు చేసుకుంటూ తమ కెరీర్ కొనసాగిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్‌ నటించినంచిన సినిమాలేవి భారీ కలెక్షన్లను రాబట్ట లేకపోయాయి. ఇక వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమాతోనే 100 కోట్ల భారీ కలెక్షన్ అందుకుని అన్న కంటే ఎక్కువ స్టార్ డమ్‌ను దక్కించుకున్నాడు. ఇక ఈ విధంగా సినిమాలలోకి వచ్చి తమ కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ స్టార్ డ‌మ్‌ను సంపాదించుకున్న హీరోలు వీరే.

Share post:

Latest