చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ చాలా వెనుకబడి ఉందనే సంగతి తెలిసిందే. ఇక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది..గత ఎన్నికల్లో 14కి 13 సీట్లు గెలుచుకుంది..ఇప్పుడు ఏకంగా కుప్పం సీటుని కూడా గెలుచేసుకోవాలని చూస్తుంది. ఇక వైసీపీకి చెక్ పెట్టడానికి బాబు కూడా గట్టిగానే కష్టపడుతున్నారు. సొంత జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు నాయకులకు క్లాస్ పీకి..దూకుడుగా పనిచేసేలా చేశారు. దీని వల్ల కొన్ని స్థానాల్లో పార్టీ పరిస్తితి మెరుగైంది.
ఎలాగో బాబు కుప్పంపై కూడా ఫుల్ ఫోకర్ పెట్టారు. దీంతో జిల్లాలో కుప్పం, పీలేరు, పలమనేరు, నగరి, మదనపల్లె లాంటి స్థానాల్లో పార్టీ పరిస్తితి మెరుగ్గానే ఉంది. ఇక పుంగనూరు, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, గంగాధర నెల్లూరు లాంటి స్థానాల్లో ఇంచార్జ్‌లు ఉన్నారు గాని..పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు. ఇక చిత్తూరు, సత్యవేడు, పూతలపట్టు, తంబళ్ళపల్లె లాంటి స్థానాల్లో సరిగ్గా ఇంచార్జ్‌లు కూడా లేరు.
ఎన్నికలై మూడున్నర ఏళ్ళు అయినా సరే ఇంచార్జ్‌లు లేకపోవడం వల్ల ఆయా స్థానాల్లో టీడీపీ పరిస్తితి ఘోరంగా ఉంది. ఇక ఇటీవల బాబు నియోజకవర్గ ఇంచార్జ్‌లతో వన్ టూ వన్ సమావేశాలు పెడుతున్నారు. ఇప్పటికే 120 స్థానాల వరకు అయ్యాయి. దీంతో ఇంచార్జ్‌లు లేని స్థానాలకు కొత్తగా ఇంచార్జ్‌లని పెడుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా సత్యవేడు స్థానానికి మాజీ ఎమ్మెల్యే హేమలతని ఇంచార్జ్‌గా పెట్టారు.
2009లో ఈమె టీడీపీ నుంచే గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో సీటు రాలేదు. 2019లో జడ్డా రాజశేఖర్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అప్పుడప్పుడు మాత్రమే యాక్టివ్ గా పనిచేశారు. దీంతో ఆయనకు ఇంచార్జ్ పదవి ఇవ్వలేదు. ఇక హేమలత అక్కడ యాక్టివ్ అయ్యారు…తనకు గాని తన కుమార్తెకు గాని ఇంచార్జ్ పదవి ఇవ్వాలని కోరారు. తాజాగా హేమలతకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు. రాజశేఖర్‌కు వెరా పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది.
అయితే సత్యవేడుకు ఫిక్స్ చేశారు గాని చిత్తూరు, పూతలపట్టు స్థానాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి. అటు తంబళ్ళపల్లెలో శంకర్ యాదవ్ సరిగ్గా పని చేయట్లేదు..అక్కడ ఆయన్ని మార్చాలి. మరి ఈ మూడు స్థానాలకు ఇంచార్జ్‌లని ఎప్పుడు పెడతారో చూడాలి.