మళ్లీ మొదలైన మెగా – నందమూరి లోల్లి..ఎన్టీఆర్-చరణ్ స్పందించాల్సిందేనా..?

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆ సినిమా తర్వాత వారు చేసే తర్వాత సినిమాలను కూడా పాన్ ఇండియా ఇమేజ్ కు మ్యాచ్ అయ్యేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా తన తర్వాత సినిమాని స్టార్ దర్శకుడైన కొరటాల శివతో చేయబోతున్నాడు.

ఈ సినిమాల తర్వాత కూడా వీరిద్దరి లైన్ అప్ చూస్తుంటే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఎన్టీఆర్ కొరటాలతో సినిమా పూర్తి అయిన వెంటనే పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో తన తర్వాత సినిమా చేయబోతున్నాడు. రామ్ చరణ్ కూడా ఎవరు ఊహించని విధంగా ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబుతో తన తర్వాత సినిమా చేయబోతున్నట్టు నిన్న ప్రకటించాడు.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

ఈ చర్చకు ప్రధాన కారణం బుచ్చిబాబు ముందుగా ఎన్టీఆర్ తోనే తన తర్వాత సినిమా చేస్తానని చెప్పటం. ఎన్టీఆర్‌కు కథ కూడా చెప్పి సినిమా ఓకే అయినట్టు ప్రచారం కూడా జరిగింది. ఆ కథలో సెకండాఫ్ ఎన్టీఆర్‌కు నచ్చకపోవడంతో సెకండ్ హాఫ్ లో మార్పులు కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ – కొరటాల సినిమా ఆలస్యం కావడం, ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి కాకుండా బుచ్చిబాబు ప్రాజెక్ట్ లో నటించేే ఆలోచన లేకపోవడంతో. బుచ్చిబాబు కథలో ఫస్టాఫ్ ఉన్నంత సెకండ్ ఆఫ్ లేకపోవడంతో తారక్ ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

Telugu Buchi Babu, Charan, Koratala Shiva, Prashanth Neel, Sukumar, Tollywood-Mo

తర్వాత బుచ్చిబాబు – రామ్ చరణ్ ను కలిసి తన దగ్గర ఉన్న ఒక కథను చెప్పి ఒప్పించి తనతో సినిమా చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా జనవరి నుంచి మొదలుకానుంది అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో చరణ్ డిసిషన్ రైట్ అవుతుందా లేక ఎన్టీఆర్ తీసుకున్న డెసిషన్ రైట్ అవుతుందా అనేది చూడాలి. ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాపై దర్శకుడు బుచ్చిబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా విషయం ఈ ఇద్దరి స్టార్ హీరోల అభిమానుల మధ్య ఆ హాట్‌ టాపిక్ గా మారింది.