తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పూనమ్ భాజ్వా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ, కన్నడ భాషలలో నటించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. నటిగానే కాకుండా మోడల్ గా కూడా తన టాలెంట్ ను బయటపెట్టిన ఈమె తొలిసారిగా ” మొదటి సినిమా ” అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది . ఈ సినిమా పెద్దగా చెప్పుకోదగ్గ హిట్ కాకపోయినా ..సైలెంట్ లుక్స్ తో పూనమ్ ..అదిరిపోయే ఆఫర్స్ ను అందుకుంటూ ..పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది.
ఇక ఇలాంటి టైం లోనే నాగార్జున హీరోగా నటించిన బాస్ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్గా నటించి మంచి మార్కులు వేయించుకుంది . అయితే బొద్దుగా ఉండే బ్యూటీ కావడంతో సినిమాలో అవకాశాలను పెద్దగా దక్కించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లోదూసుకుపోతున్న పూనమ్ తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తుంది. కాగా ఈ క్రమంలోనే ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది .
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ట్రెండీ వేర్ తో సోషల్ మీడియాని షేక్ చేసే పూనమ్ .. ట్రెడిషనల్ లుక్స్ లో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ “మ్యారూ మీ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది . దీంతో అమ్మడు పెళ్లి ఫిక్స్ అయిందంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. కాదు కాదు సినిమాలో ఆఫర్స్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ తన పేరుని పాపులర్ చేసుకుంటుందిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే అమ్మడు ఓపెన్ గా మ్యారీ మీ అని చెప్పేసింది. దీనికి ఎవరు ఓకే చెప్పి అమ్మడు ని లైఫ్ లాంగ్ పార్ట్ నర్ గా నిలుస్తాడో..ఆ అదృష్టవంతుడు ఎవడో ..?అంటూ జనాలు చర్చించుకుంటున్నారు..!!
View this post on Instagram