బ్రేకింగ్: ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ..!

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై విజయ్ దేవరకొండ కెరియర్ లోనే అత్యంత చెత్త సినిమా గా మిగిలిపోయింది. ఆ సినిమా విడుదలై ఇన్ని నెలలు గడుస్తున్నా ఆ సినిమా తాలూకు మరకలు విజయ్ దేవరకొండ ను వదిలిపెట్టడం లేదు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌ల‌గా ఉన్న పూరి జగన్నాథ్- చార్మి ల‌ను కూడా ఈడీ విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసింది.

Vijay Devarakonda Appears before Enforcement Directorate Regarding a Case  on Liger Movie Production | 'లైగర్' చిక్కుల్లో విజయ్ దేవరకొండ.. ఈడీ  విచారణకు హాజరు? News in Telugu

ఇప్పుడు తాజాగా హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ డి విచారణకు హాజరయ్యారు. ఆ సినిమా లావాదేవీల విషయంలో విజయ్ ను ప్రశ్నిస్తున్నారు అని తెలుస్తుంది. ఈ సినిమా నిర్మాణం కోసం దుబాయ్ నుంచి డబ్బులు వచ్చాయని. ఇక్కడ డబ్బులు అక్కడకు పంపి పెట్టుబడి పెట్టినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.

Vijay Devarakonda: ఈడీ విచారణకు హాజరైన నటుడు విజయ్‌ దేవరకొండ

అంతేకాకుండా ఈ పెట్టుబడులు వెనుక ఓ ప్రముఖ రాజకీయ నేత హస్తం ఉన్నట్టు కూడా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై త్వరలోనే ఒక క్లారిటీ రానుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈడి అధికారులు విజయ్ దేవరకొండ ను విచారిస్తున్నారు. విజయ్ త‌ర్వాత‌ ఇంకా ఎంతమంది బయటకు వస్తారో చూడాలి.