తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్ పాత్రలలో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన నటుడు సత్య ప్రకాష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తాజగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సత్య ప్రకాష్ మాట్లాడుతూ సమరసింహారెడ్డి సినిమా సమయంలో వైజాగ్ జగదాంబ సెంటర్లు షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను ఒక లేడీ వెనుక మాట్లాడుతూ వీడే ఆ దరిద్రుడు అని సినిమాలో రేప్ చేసే సీన్ లో నటించిన కామెంట్ చేశారని చెప్పుకొచ్చారు. అక్కడున్న పరిస్థితిని చూస్తే దొరికితే చంపేసే అంత కోపంతో ఉన్నట్లుగా కనిపించారని తెలియజేశారు.
అయితే తాను సినిమాలలో నటించే పాత్రలు నిజమేనని చాలామంది భావిస్తూ ఉంటారని తెలిపారు సత్య ప్రకాష్. దీంతో అంత దరిద్రంగా నేను యాక్టింగ్ చేశానా అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటారని తెలిపారు. పాత్రలో నేను జీవించడంతో అలా చెబుతూ ఉంటారని సత్య ప్రకాష్ తెలిపారు. బాలకృష్ణతో ఇప్పటివరకు 10 కంటే ఎక్కువ సినిమాలు చేశానని తెలిపారు. ముఖ్యంగా బాలకృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని సత్య ప్రకాష్ తెలిపారు.
ఒక చిత్రంలో సినిమా షూటింగ్ సమయంలో పైనుంచి కిందకు దూకాల్సిన సీన్ చేయడానికి నేను భయపడ్డాను అని బాలకృష్ణ మాత్రం చాలా ధైర్యంగా చాట్ చేశారని తెలిపారు. ఇక విజయేంద్ర వర్మ సినిమా షూటింగ్ సమయంలో బిల్డింగ్ పైనుంచి దూకే సన్నివేశంలో బాలయ్య సునాయాసంగా చేశారని తెలిపారు ఆ సమయంలో బాలకృష్ణ కాలి నుంచి రక్తం వస్తోందని తెలిపారు. ఇలాంటి నటుడుని నేను ఏ ఇండస్ట్రీలో కూడా చూడలేదని తెలిపారు. ఇలా బాలయ్య గొప్పతనాన్ని వివరిస్తూ పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు సత్య ప్రకాష్.