టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ మధ్యకాలంలో వచ్చిన RRR సినిమా బ్లాక్ బస్టర్ హీట్ కొట్టిందన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ తదుపరి సినిమాపై క్లారిటీ వచ్చి ఇప్పటికి ఎంతో కాలం అవుతోంది. అయితే ఈ సినిమా కూడా సెట్స్ మీదికి వెళ్ళటం జరుగుతుందా లేదా అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న టైంలో త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడని అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లలేదు. ఎందుకో కానీ త్రివిక్రమ్, మహేష్ తో సినిమా చేయబోతున్నాడు.
RRR సినిమా చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ కు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ అవేవీ సెట్స్ మీదికి రాలేదు. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఆ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నాడు. దీంతో త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ జూనియర్ ఎన్టీఆర్ ను పక్కనకి పెట్టేశారు. ఇదంతా పక్కన పెడితే..జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీస్తాను అంటూ కొరటాల శివ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. కొరటాల శివ ఎన్టీఆర్ 30 వ చిత్రాన్ని తీయబోతున్నాడని ప్రకటన వెలుబడడం జరిగింది.
అయితే బుచ్చి బాబు దర్శకుడితో సినిమా మొదలవుతోందని అంటూ కొన్ని కథనాలు పుట్టుకొచ్చాయి. అంతేకాకుండా బుచ్చి బాబు టీం కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అంతే ఏమైయిందో ఏమో కానీ RRR లోనే మరోక హీరో రామ్ చరణ్ తో సినిమా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే సడన్గా బుచ్చి బాబు ఎన్టీఆర్ ని ఎందుకు పక్కన పెట్టాడు అనే విషయంపై చర్చ జరుగుతోంది. మరోపక్క కొరటాల శివ స్క్రిప్టును ఎన్టీఆర్ ఫైనల్ చేయలేదు. ఇంతకు ఎన్టీఆర్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి అన్ని విషయాలకు ఎన్టీఆర్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.ఇలా ఎన్టీఆర్ సినిమాలు ఆగిపోవడానికి ముఖ్య కారణం కథలు సరిగ్గా లేకపోవడమే అన్నట్లుగా సమాచారం.