`ఎన్టీఆర్ 30`.. ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన క‌థ‌కు యంగ్ టైగ‌ర్ ఓకే చెప్పాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్‌ టైటిల్ తో ప్రారంభం కాబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించబోతున్నారు.

తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం మ‌రి కొద్ది రోజుల్లో సెట్స్‌ మీదకు వెళ్లబోతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. `ఎన్టీఆర్ 30` కథకు ఫస్ట్ ఛాయిస్ యంగ్ టైగర్ కాదట.

కొరటాల మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమాను చేయాలని భావించాడట. ఈ నేపథ్యంలోనే చరణ్ కు కోరటాల స్టోరీని కూడా వినిపించాడట. కానీ పలు కారణాల వల్ల ఆయ‌న రిజెక్ట్ చేశాడట. అయితే ఇప్పుడు చరణ్ రిజెక్ట్ చేసిన కథనే ఎన్టీఆర్ ఓకే చేసి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.

Share post:

Latest