బుచ్చిబాబు సనా.. `ఉప్పెన` సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడీయన. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఉప్పెన మూవీతో హీరో హీరోయిన్లకే కాదు డైరెక్టర్ బుచ్చిబాబు కూడా సూపర్ క్రేజ్ దక్కింది.
ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావించాడు. కానీ వీరి కాంబో ప్రాజెక్ట్ పలు కారణాల వల్ల కుదరలేదు. దీంతో బుజ్జిబాబు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైన్లో పెట్టాడంటూ గత కొద్ది రోజుల నుండి జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలే ఇప్పుడు నిజం అయ్యాయి.
రామ్ చరణ్ తో బుచ్చిబాబు సినిమా కన్ఫామ్ అయ్యింది. `ఆర్స్ 16`ను బుచ్చిబాబు డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మేరకు తాజాగా ఓ పోస్టర్‌ను బయటకు వదిలారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కీలారు పాన్ ఇండియా నిర్మించనున్నారు. హీరోయిన్ ఎవరు, షూటింగ్ ఎప్పుడు అన్న వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. మొత్తానికి మెగా హీరోతో సినిమా కన్ఫార్మ్ అవ్వడంతో బుచ్చిబాబు సాధించాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.