టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అనవసరంగా కొంతమంది హీరోయిన్లు ట్రోల్ అవుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి కొంతమంది హీరోయిన్స్ నోరు జారడం వల్ల పలు వివాదాలలో చిక్కుకోవడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ గా మారిపోయింది. అలా పలు సందర్భాలలో మాట్లాడడం వల్ల చిక్కుల్లో పడ్డ అందమైన హీరోయిన్స్ గతంలో చాలామందె ఉన్నారు. ఇటీవల కూడా చాలామంది హీరోయిన్స్ ఆలోచించకుండా మాట్లాడి పలు వివాదాలలో చిక్కుకున్నారు.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన నటి రష్మిక ఇటీవల విడుదలైన కాంతార చిత్రం ఇంతవరకు చూడలేదని చెప్పడంతో ఇమే పైన ట్రోల్ జరగడం జరుగుతోంది. అంతేకాకుండా తనకి మొదటి ఆఫర్ ఇచ్చిన నటుడు రిషబ్ శెట్టి పేరు చెప్పకుండా ఉండడంతో కన్నడ ప్రజలు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఈమె పైన చాలా వ్యతిరేకత చూపిస్తున్నారు.
ప్రస్తుతం సౌత్‌లో స్టార్ హీరోయిన్గా ఉన్న పూజా హెగ్డే వరుస ప్లాపులను చవిచూస్తున్నది. స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దు గుమ్మ నోటి దురుసు కూడా ఎక్కువే అని గతంలో ఒకానొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దక్షిణాది ప్రేక్షకులకు నడుము, బొడ్డు ఉంటే చాలు వ్యామోహంలో పడిపోతారని నోరు జారడం జరిగింది. దీంతో ఒకానొక దశలో ఇమెను కూడా బ్యాన్ చేయాలని చూశారు.
బాలీవుడ్ హీరోయిన్ రీచా చద్దా కూడా ఇండియన్ ఆర్మీ పైన కాంట్రవర్సీ కామెంట్లు చేయడంతో వార్తలలో నిలిచింది. ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే ఫాక్ ఆక్రమించిన వాటిని ఇండియన్ ఆర్మీ జేజిక్కునేందుకు సిద్ధంగా ఉందని నార్తర్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ట్విట్ చేయడం జరిగింది.అందుకుగాను రీచా స్పందిస్తూ గాల్వాన్ హాయ్ చెబుతోంది అంటూ కామెంట్స్ చేసింది దీంతో ఈమె పైన తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి సైతం ఆ మధ్య ఒక నేషనల్ ఇష్యులలో కూడా చిక్కుకుంది. ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా కాశ్మీర్ పండిట్లు మారణ హోమం గోహత్యలను లింక్ చేయడం చేయడంతో వివాదాలలో చిక్కుకుంది. ఇక విరే కాకుండా మరి కొంతమంది ఉన్నారు.