అఖండ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆయన కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆఖండ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ ఆ తర్వాత క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని తో తన 107వ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ లోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. రీసెంట్గా ఈ సినిమాకి వీరసింహారెడ్డి అనే టైటిల్‌ని కూడా అనౌన్స్ చేశారు. బాలకృష్ణ ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు. దర్శకుడు ఈ సినిమాను పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాను 2023 సంక్రాంతి కనుక భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్, మలయాళ నటి హనీ రోజ్, కన్నడ నటుడు దునియా విజయ్ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా బాలకృష్ణ తన తర్వాత సినిమాను స్టార్ట్ దర్శకుడు అనిల్ రావిపూడి తో చేయబోతున్నడు. ఆ సినిమాకు రామారావు గారు అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా బాలీవుడ్ భామ దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నారని తెలుస్తుంది. ఇందులో శ్రీ లీలా, ప్రియమణి కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై యువ నిర్మాతలు హరీష్ పెద్ద, సాహు గారపాటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది.