బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ.. పేరు తెలిస్తే అభిమానులకు పండగే..!

అఖండ బ్లాక్ బాస్టర్ హిట్‌ తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆయన కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆఖండ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ ఆ తర్వాత క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని తో తన 107వ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ లోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమాకి వీరసింహారెడ్డి అనే టైటిల్‌ని కూడా అనౌన్స్ చేశారు. బాలకృష్ణ ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. దర్శకుడు ఈ సినిమాను పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.

Latest: NBK107 is officially titled Veera Simha Reddy | 123telugu.com

ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాను 2023 సంక్రాంతి కనుక భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్, మలయాళ నటి హనీ రోజ్, కన్నడ నటుడు దునియా విజయ్ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

Sonakshi Sinha to pair up with Balakrishna for his next? | The News Minute

ఇదిలా ఉండగా బాలకృష్ణ తన తర్వాత సినిమాను స్టార్ట్ దర్శకుడు అనిల్ రావిపూడి తో చేయబోతున్నడు. ఆ సినిమాకు రామారావు గారు అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా బాలీవుడ్ భామ దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నారని తెలుస్తుంది. ఇందులో శ్రీ లీలా, ప్రియమణి కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై యువ నిర్మాతలు హరీష్ పెద్ద, సాహు గారపాటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది.

Share post:

Latest