బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం భర్త రణబీర్ కపూర్ తో కలిసి ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆలియా.. కాసేపటి క్రితమే పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే రణబీర్ తో పాటు హాస్పిటల్ లో సోనీ రజ్దాన్, నీతూ కపూర్ ఆలియా కి తోడుగా ఉన్నారని సమాచారం అందుతుంది. ఈ పాప రావడంతో అలియా భట్ మరియు రణబీర్ ఇంట్లో సంబరాలు షురూ అయ్యాయి. గత కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్న అలియా భట్, రణబీర్ కపూర్ ఈ ఏడాది ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
అయితే పెళ్లయిన రెండు నెలలకే ఈ జంట ప్రెగ్నెన్సీ వార్తను బయటపెట్టారు. అలియా భట్ ప్రెగ్నెంట్ అయినా సరే షూటింగ్స్ లో మరియు బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ లో బాగా యాక్టివ్ గా పాల్గొంది. ప్రస్తుతం తల్లితండ్రులైన వీరిద్దరికీ సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.