బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం భర్త రణబీర్ కపూర్ తో కలిసి ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆలియా.. కాసేపటి క్రితమే పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రణబీర్ తో పాటు హాస్పిటల్ లో సోనీ రజ్దాన్, నీతూ కపూర్ ఆలియా కి తోడుగా ఉన్నారని సమాచారం అందుతుంది. […]