తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా భ‌ర్త పేరు మీద పెట్ట‌ని సుమ‌.. అదే కార‌ణ‌మా?

బుల్లితెర స్టార్ యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుమా కనకాల గురించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయనక్కర్లేదు. బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రతి ఒక్క ఛానల్లో ఏదో ఒక షో ద్వారా ప్రేక్షకులను తన గల గల మాటలతో అలరిస్తూ ఉంటుంది. అదేవిధంగా సినిమా ఈవెంట్, ప్రీ రిలీజ్ వేడుక, అవార్డ్ ఫంక్షన్ ఇలా ఒకటి ఏంటి ఏ ఈవెంట్ జరిగినా సుమ గొంతు అక్కడ వినబడాల్సిందే.

 

ఇటీవల సుమ బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా `జయమ్మ పంచాయతీ` సినిమా ద్వారా క‌నిపించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.ఈ విధంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా ఈవెంట్స్ అలాగే బుల్లితెర కార్యక్రమాలతో సుమ స్టార్ యాంకర్ గా ఎంతో బిజీగా కొనసాగుతూ రెండు చేతుల సంపాదిస్తుంది.

 

అయితే సుమ ఇప్పటివరకు ఎంతో కష్టపడి దాదాపు 100 కోట్ల వరకు సంపాదించుకున్నట్లు నెట్టింట్లో వార్తలు వస్తున్నాయి. ఈమె కెరీర్ ప్రారంభం నుండి సంపాదించిన డబ్బుని వృధాగా ఖర్చు పెట్టకుండా ఇల్లు, స్థలాలు, బంగారం అలాగే బిజినెస్ రంగంలో ఇన్వెస్ట్ చేసిందట. ప్రస్తుతం అవన్నీ కలిపి దాదాపు 100 కోట్లకు పైగానే సుమ వెనకేసిందట. అయితే సుమ తను కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తం తన ఇద్దరి పిల్లలపైనే రాసిందట.

సుమ తన ఆస్తిలో చిల్లిగవ్వ‌ కూడా భర్త పేరు మీద పెట్టలేదని వార్తలు వస్తున్నాయి. అందుకు గల కారణం గతంలో సుమ రాజీవ్ కన‌కాల ఇద్దరు విడాకులు తీసుకోపోతున్నారంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. ఆ వార్తలపై స్పందిస్తూ సుమ.. అవును మా ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా మేమిద్దరం విడిపోదామనుకున్నది నిజమే.. కానీ మా పిల్లల ఫ్యూచర్ కోసం మేమిద్దరం కలిసి ఉండాల్సి వస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ కారణం చేతనే తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా రాజీవ్ కు దక్కకుండా చాలా పగడ్బందీగా సుమా.. తన ఆస్తి మొత్తం తన పిల్లలకి చెందేలాగా అగ్రిమెంట్ రాసిందట. ఇకపోతే సుమా రాజీవ్ కన‌కాల ఇప్పటికీ కాస్త దూరంగానే ఉంటున్నట్టు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.