ఆయన కోసమే అలాంటి రిస్క్ చేసిన సౌందర్య.. చివరికి..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అలనాటి అందాల తార స్టార్ హీరోయిన్ మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు సంపాదించుకున్నారు. తర్వాత ఆ తర్వాత కాలంలో అంతటి పేరు సంపాదించుకున్న హీరోయిన్ సౌందర్య మాత్రమే.. ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీలో అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక ఏ హీరోతో నటించినా ఆ హీరోతో బెస్ట్ జోడిగా గుర్తింపు తెచ్చుకుంది సౌందర్య.. హోమ్లీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సౌందర్య గ్లామర్ షో కి దూరంగా ఉంటూ తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఇక కెరియర్ పీక్స్ లో ఉండగానే ఒక పార్టీ ప్రచారకర్తగా బయలుదేరీ కొద్దీ సమయంలో హెలికాప్టర్ మధ్యలోనే పేలిపోయి ఆమె మరణం చెందింది. ఇక ఇలా యుక్త వయసులోనే స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో సౌందర్య మరణం సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది.

Soundarya: అతనితో నటిస్తే కెరీర్ ఖతం.. సౌందర్యను అలా బెదిరించిన వ్యక్తి  ఎవరు? – Telugu Online News

నిజానికి సౌందర్య దర్శక నిర్మాతల మనిషి అని చెప్పవచ్చు . ఇక వారు అడిగితే ఎలాంటి పాత్రలైనా చేయడానికి ఆమె వెనకాడదు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న సౌందర్య.. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కోరిక మేరకు బాబు మోహన్ నటించిన మాయలోడు సినిమాలో బాబు మోహన్ పక్కన ఏకంగా ఒక పాటలో డాన్స్ చేయడానికి ఒప్పుకుంది. అయితే ఇలా సౌందర్య ఒప్పుకున్నప్పుడు.. అందరూ కూడా నీది స్టార్ హీరోయిన్ రేంజ్.. ఒక కమెడియన్ తో నువ్వు ఆడి పాడితే నీ కెరియర్ డౌన్ అవుతుంది.. వెంటనే చేయనని చెప్పేసేయ్ అని ఆమె సన్నిహితులు, తోటి నటీనటులు కూడా చెప్పారట.

యమలీల'లో హీరోయిన్‌గా సౌందర్య.. అడ్వాన్స్ కూడా... గుట్టు విప్పిన ఎస్వీ  కృష్ణారెడ్డి | SV Krishna reddy ABout Yamaleela Soundarya and ALi - Telugu  Filmibeat

కానీ సౌందర్య ఈ విషయంలో ఏ మాత్రం ఆలోచించకుండా ఎస్వీ కృష్ణారెడ్డి కోరిక మేరకు మాయలోడు సినిమాలో బాబు మోహన్ తో చినుకు చినుకు అందెలతో అనే పాటలో మాస్ స్టెప్ వేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది అని చెప్పాలి. చివరికి సౌందర్య కి కూడా మరింత గుర్తింపు లభించింది.