అమలాపాల్ కి ఆ స్టార్ బ్యానర్ పై అవకాశం.. ఎలా సాధ్యమైంది..?

కేరళ హీరోయిన్ అమలాపాల్ కెరియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగు తమిళ్ ,మలయాళం వంటి భాషలలో కూడా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. కెరియర్ ఆర్థిక సాగుతున్న సమయంలో డైరెక్టర్ ఏఎల్ విజయ్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు.కొన్ని మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. దీంతో అమలాపాల్ ఒక్కసారిగా డౌన్ అయిందని చెప్పవచ్చు. అమల పాల్ కారణంగానే వీరిద్దరూ విడిపోయారని అందరూ ఆమెను ఆడిపోసుకున్నారు.

Amala Paul moves court to take action against ex-boyfriend Bhavninder Singh  | Tamil Movie News - Times of India

ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ కెరియర్ పైన కాస్త ప్రభావం పడిందని చెప్పవచ్చు. దీంతో కోలీవుడ్లో అమలాపాల్ ని బ్యాన్ చేస్తోందని సైతం వార్తలు వినిపించాయి. కొంతమంది దర్శక నిర్మాతలు సైతం ఈ రకమైన చర్యలు తీసుకోబోతున్నట్లు అప్పట్లు వార్తలు బాగా వినిపించాయి. కానీ ఈ ముద్దుగుమ్మ ఎలాంటి వాటికి భయపడకుండా కెరీర్ ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినప్పటికీ వాటన్నిటిని తట్టుకొని ముందుకు సాగుతోంది.

మళ్లీ కోలీవుడ్లో అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. తెలుగులో చివరిగా జెండాపై కపిరాజు చిత్రంలో నటించింది ఆ తర్వాత పిట్టకథలు అనే సినిమాలో నటించింది. ఇక ఇవేవీ ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం తన సొంత బ్యానర్ లోనే మాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది. అయితే అందుకోసం మైత్రి మూవీ మేకర్స్ సహాయంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకి దర్శకత్వం ఐజాబ్ ఖాన్ వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సెట్లు ఉన్నది. ఇక అమలాపాల్ మైత్రి మూవీతో ఎంట్రీ ఇవ్వడం ఇండస్ట్రియల్ హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ చిత్రం పాన్ ఇండియా లేవాళ్ళు విడుదల చేయబోతున్నట్లు సమాచారం.