వారేవా: సోషల్ మీడియాలో ఏ హీరో అందుకొని రికార్డును.. అందుకున్న రామ్ చరణ్..!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. రామ్ చరణ్ సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. ఈ సందర్భంలోనే ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన తక్కువ సమయంలోనే 9 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న హీరోగా రామ్ చరణ్ రికార్డులు సృష్టించారు. రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో బిజీగా ఉన్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో రామ్ చరణ్ మరో స్థాయికి వెళ్తాడని మెగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tollywood 'Thalaiva'?: The only star hero in Nepal is a Telugu Hero - The  Leo News | English News

ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలను ఇన్‌స్టాగ్రామ్‌ లో ఎంతమంది ఫాలో అవుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాప్‌లో ఉన్నాడు. అతడి ఖాతాలో 19.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. పుష్ప సినిమా సక్సెస్ తర్వాత బన్నీకి ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. ఈ జాబితాలో రెండో స్థానంలో విజయ్ దేవరకొండ ఉన్నాడు. అతని ఖాతాలో 17.7 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న మహేష్‌బాబు ఖాతాలో 8.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఖాతాలో 8.9 మిలియన్ ఫాలోవర్లు, జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో 4.7 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.