ప్రియుడితో ర‌కుల్ బ్రేకప్‌.. ఇదిగో ఫుల్ క్లారిటీ!?

రకుల్ ప్రీత్ సింగ్..కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా పరిచయమై, ఆ తరువాత తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే హిట్ అందుకుని స్టార్ హీరోలందరి జంట‌గా నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. రకుల్ తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది.

కానీ ఇటీవల వచ్చిన మన్మధుడు 2, కొండపురం సినిమాలు డిజాస్టర్ కావడంతో కాస్త ఢీలా పడింది ముద్దుగుమ్మ. దీంతో బాలీవుడ్ మీద అదృష్టం పరీక్షించుకునేందుకుగాను ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది. అయితే రకుల్ బాలీవుడ్ నటుడు మరియు ప్రొడ్యూసర్ అయినా జాకీ భగ్నానితో ప్రేమలో ఉందని.. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో త్వరలో పెళ్లి పీటలేకపోతున్నారంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

తాజాగా రకుల్ సోదరుడు త్వరలోనే రకుల్ వివాహం చేసుకోబోతుందంటూ చేసిన ప్రకటనకు రకుల్ “నాకు తెలియకుండా నా పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారా“..? అంటూ రకుల్ రియాక్ట్ అయిన పద్ధతి చూసి, జాకీతో బ్రేకప్ అయింది.. అందుకే రకుల్ ఇలా రెస్పాండ్ అయిందంటూ కొత్త వార్తలు వచ్చాయి. ఆ పుకారులన్నిటికీ బ్రేక్ వేసినట్టు రకుల్ తాజాగా ప్రూవ్ చేసుకుంది. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ నిర్మాత రమేష్ పౌరాణి ఇచ్చిన స్పెషల్ దీవాలి పార్టీలో రకుల్ ప్రీత్ సింగ్ జాకి జంట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అలా ఈ జంటను చూసిన నేటి జనులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రియుడితో బ్రేకప్ అన్న పుకార్లకు రకుల్ ఈ ఫోటోలతో ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ జంట ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

https://twitter.com/EliteShowbiz/status/1583115563706249216?s=20&t=BdBeFDORbPdSIty4Zid73A