అల్లు అర్జున్ వైఫ్ స్పేహా క‌ట్టుకున్న ఆ చీర ధ‌ర తెలిస్తే క‌ళ్తు తేలేస్తారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి లను స్టార్ జంట అనేకన్నా స్టైలిష్ జంట అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ప్రస్తుత ట్రెండ్ ను ఫాలో అవుతూ స్టైల్ మైంటైన్ చేయడంలో వీరిద్దరూ ముందంజలో ఉంటారు. అల్లు అర్జున్ ప్రతి సినిమాకు తన లుక్ ని ఎలా మార్చేస్తూ ఉంటాడో అలాగే ఆయన భార్య స్నేహ కూడా డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది.

తాజాగా ఆమె సిల్వర్ కలర్ లో ఉన్న చీర ధరించి ఉన్న ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అయితే ఈ చీరను రిమ్ జిమ్ దాదు డిజైన్ చేయగా, ప్రీతమ్ జుల్కర్ తనను అంత స్టైలిష్ గా మరియు అందంగా రెడీ చేశారని స్నేహ పేర్కొంది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు స్టార్ హీరోయిన్స్ కూడా మీ ముందు దిగదుడుపే అంటూ.. ఎంతో అందంగా చంద‌మామ‌ల‌ ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు.

ఇంతకీ అల్లు అర్జున్ వైఫ్ స్నేహ కట్టుకున్న ఆ చీర ధర తెలిస్తే పాపం కళ్ళు తేలేస్తారు. ఎంత అంటే అక్షరాల లక్ష డెబ్భై ఆరు వేల రూపాయలు మాత్రమే.. చూడడానికి ఇంత సింపుల్ గా ఉంది కానీ అంత ధర ఉంది అంటే నెటిజన్లు ఒక్క‌సారిగా షాక్ కి గురవుతున్నారు. ప్రస్తుతం స్నేహ రెడ్డికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.