ఎన్టీఆర్ – పులి ఫైట్‌కు మించి బ‌న్నీ – సింహం ఫైట్ ఉండ‌బోతోందా…!

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వ‌చ్చిన పుష్ప సినిమా ఎంత సూప‌ర్ హిట్ అయ్యిందో చూశాం. ఈ సినిమా బాలీవుడ్‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి ఏకంగా రు . 100 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇప్పుడు పుష్ప‌కు సీక్వెల్‌గా పుష్ప 2 రాబోతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే పుష్ప 2లో బ‌న్నీ సింహంతో పోట్లాడే సీన్ ఉంద‌ట‌. సుకుమార్ టీం ఈ సీన్ సినిమాకు హైలెట్ గా ఉండేలా డిజైన్ చేస్తోంద‌ట‌.

ఈ సీన్ షూట్ చేసేందుకే సినిమా యూనిట్ అంతా థాయ్ లాండ్ వెళుతున్నారు. అక్క‌డ అడ‌వుల్లో బ‌న్నీ, సింహం సీన్ షూట్ చేస్తున్నారు. అయితే ఈ సీన్ ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ – పులి ఫైట్‌ కి మించి ఉండేలా సుకుమార్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌ట‌. ఎన్టీఆర్‌, పులి ఫైట్‌కు బ‌న్నీ – సింహం పైట్‌కు త‌ప్ప‌కుండా కంపేరిజ‌న్ చేస్తారు.

అందుకే ఆ ఫైట్ సీన్‌ను మించి ఉండేలా బ‌న్నీ – సింహం ఫైటింగ్‌ను సుక్కు డిజైన్ చేస్తున్నాడ‌ట‌. పుష్ప‌లోనే బ‌న్నీ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పుడు పుష్ప 2 లో కూడా బ‌న్నీ క్యారెక్ట‌ర్ ఊహించ‌ని రేంజ్ లో ఉండేలా రాసుకున్నాడ‌ట సుక్కు. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 500 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

 

Share post:

Latest