భారీగా రేటు పెంచేసిన బాల‌య్య‌..అనిల్ రావిపూడి మూవీకి అన్ని కోట్లా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ “అఖండ“ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని తన నెక్స్ట్ సినిమా గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. బాలకృష్ణ ఈ సినిమా కోసం గాను 18 కోట్లు దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు అలాగే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాకు మరో 7 కోట్లు రెమ్యునరేషన్ పెంచేసారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అనిల్ రావిపుడి దర్శకత్వంలో ఎన్.బి.కె 108వ సినిమా షైన్ స్క్రీన్ బ్యానర్లో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. బాలకృష్ణ ఈ సినిమా కోసం 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు ఇండస్ట్రీలో వార్తలు చక్కెరలు కొడుతున్నాయి. బాలయ్య సినిమా హిట్టు పడితే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే.. అదికూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి కాంబోలో సినిమా కాబట్టే భారీగా రేటు పెంచేసాడు బాలయ్య. ఏకంగా అనిల్ రావు పూడి సినిమాకుకి 7 కోట్లు పెంచేశాడు.

అయితే ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనున్నదట. ఇటీవల అఖండ సినిమాతో వసూళ్ల సునామీ సృష్టించిన బాలయ్య రాబోతున్న రెండు సినిమాలతో మోత మోగిస్తాడని చెప్పడంలో సందేహం లేదు. ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలతో తోటీ స్టార్ హీరోలకు చమటలు పుట్టిస్తున్నాడు. ఇటీవల ప్రారంభమైన ఓటీడీ షో అన్ స్టాపబుల్ సీజన్ 2 హోస్ట్ గా కూడా దుమ్ము దులిపేస్తున్నాడు.