హీరోయిన్ తాప్సీని తెలుగు ఇండస్ట్రీలోకి రాకుండా చేసింది ఆ డైరెక్టరెనా..?

మొదట ఝుమ్మంది నాదం అనే చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది హీరోయిన్ తాప్సి. ఇక తర్వాత ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి నటిగా పేరు సంపాదించింది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. మంచి పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత నటించిన చిత్రాలు అన్నీ ఫ్లాప్ లు అయ్యాయి. అయితే ఎక్కువగా ఈమె సెకండ్ హీరోయిన్ పాత్రలో కూడా నటించడం వల్ల కేవలం మొదటి హీరోయిన్ కి పాపులారిటీ లభించింది. ఇక తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి హీరోయిన్ గా వెళ్ళింది.

Actress Tapsee Pannu latest photos-తాప్సీ గ్లామరస్ ఫొటోస్
అక్కడ ఈమె మంచి సినిమాలు చేసి సక్సెస్ సాధించింది. ఇక అదే సమయంలో డైరెక్టర్ రాఘవేంద్రరావు పై పలు సంచలన కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తరువాత తాప్సి రాఘవేంద్రరావుని స్వయంగా కలిసి ఆయనతో మాట్లాడి క్షమాపణలను కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అందుచేతనే రాఘవేంద్రరావు మాత్రం ఆమె చేసిన వ్యాఖ్యల పై మనసులో పగ పెట్టుకొని ఈమె పైన పగ తీర్చుకున్నారనే వార్తలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తాప్సి హీరోయిన్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా పలు చిత్రాలను నిర్మిస్తూ ఉన్నది.

Taapsee Pannu once explained how throwing coconut at her navel was sensuous  (Watch Video)

దీంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఇంటర్వ్యూ ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేసిందంట ఈ ముద్దుగుమ్మ. అంతగా కాకుండా కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాలని ఎంతో ప్రయత్నించినా రాఘవేంద్రరావు మాత్రం ఆమెను తెలుగు ఇండస్ట్రీలోకి రాకుండా అడ్డుకట్టు వేస్తున్నారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో మాత్రం ఎంత నిజం ఉందనే విషయం మాత్రం తెలియలేదు. కానీ ఇప్పుడు ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారుతుంది. దీంతో కొంతమంది నేటిజెన్లు సైతం ఎదుగుదలకు ఎవరైనా సపోర్ట్ చేయాలి.. వారి పనికి ఉపయోగపడకపోతే ఇలా చేస్తారా అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు రాఘవేంద్రరావుని తాప్సి ఏమనిందనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.