అవును.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. రాజకీయాలపై చాలా మంది తమ మాట విని పిస్తున్నారు. ఒకప్పుడు.. విశ్లేషకులు ప్రత్యేకంగా ఉండేవారు. ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి. అయితే.. ఇప్పుడు ఫోన్ చేతిలో ఉండి.. కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక కామెంట్ చేయ డం.. వెంటనే దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం పరిపాటిగామారిపోయింది. తాజాగా ఇలాంటి వారు.. జనసేన అధినేత పవన్‌పై కొన్ని వ్యాఖ్యలు సంధించారు.
వీరు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా ఉండడంతో రాజకీయంగా కూడా చర్చకు వస్తున్నాయి. ఇంతకీ ఏమన్నా రంటే.. తాజాగా పవన్ కళ్యాణ్.. జనసేన లీగల్ సెల్ నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన దసరా నుంచి తాను చేయాలని అనుకున్న బస్సు యాత్రను వాయిదా వేస్తున్నట్టు చెప్పా రు. సరే.. రాజకీయాల్లో ఏదైనా కార్యక్రమం చేయాలని అనుకోవడం.. వివిధ కారణాలతో వాటిని వాయిదా వేసుకోవడం సహజం. అయితే.. తర్వాత.. ఎప్పుడు ప్రారంభించేదీ చెబుతారు.
అయితే.. పవన్ మాత్రం.. ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బస్సు యాత్రను తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ చెప్పలేదు. దీంతో ఇది.. నెటిజన్లకు రాజకీయంగా కామెంట్లు చేసేందుకు.. ఛాన్స్ ఇచ్చినట్టు అయింది. దీంతో వారురెచ్చిపోయారు. “లోకేష్ కోసం.. పవన్ చేస్తున్న పెద్ద త్యాగం“ అని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు..“బస్సు యాత్రకు.. సినిమా యాత్రకు షెడ్యూల్ కుదరడం లేదు కదా.. బాస్“ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇంకొందరు.. లోకేష్ కోసమే.. పవన్ తన పార్టీని సైతం త్యాగం చేసేందుకు రెడీగా ఉన్నారని అన్నారు. ఎందుకంటే.. జనవరి నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కనుక.. దీనికి ముందే.. బస్సు యాత్ర ప్రారంభిస్తే.. సదరు పాదయాత్రపై.. ప్రభావం పడుతుందని.. అనుకున్న విధంగా మైలేజీ వచ్చే అవకాశం లేదని..అందుకే పవన్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని.. మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అయితే.. సినిమాల్లో బిజీగా ఉండడం.. సంక్రాంతికి కొన్ని షెడ్యూళ్లు కూడా ఉండడం కారణంగానే.. పవన్ యాత్రను పక్కన పెట్టారని.. చాలా మంది అభిప్రాయ పడడం గమనార్హం.