జ‌నాలు గ‌మ‌నిస్తున్నారు.. జ‌గ‌న్ ఆ విష‌యంలో మారాలా…!

మ‌నం ఏం చెప్పినా.. చెల్లుతుందిలే! అని అనుకునే రోజులు రాజ‌కీయ నేత‌ల‌కు ఎప్పుడో పోయాయి. ఎందుకంటే.. సోష‌ల్ మీడియా ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు బాగా చేరువైంది. దీంతో నాయ‌కులు ఏం చేసినా.. వారు ఏం చెప్పినా.. ప్ర‌జ‌లు ఒక‌టికి రెండు సార్లు గ‌తంలోకి వెళ్లి.. స‌రిచూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌స్తోందంటే.. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌.. త‌న ప్ర‌భుత్వ‌మే అన్నీ చేస్తోంద‌నే వాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు.

అస‌లు సంక్షేమం అంటే.. ఇదీ.. ఇలా ఉండాలి.. అని త‌న ప్ర‌భుత్వమే ప్ర‌జ‌లకు రుచి చూపించింద‌న్న ట్టుగా ఇటీవ‌ల శాస‌న‌ స‌భ‌లో మాట్లాడారు. ఇంటింటికీ.. అనేక ప‌థ‌కాలుచేరువ చేస్తున్నామ‌ని అన్నారు. అంతేకాదు.. నిధులు సైతం ప్ర‌జ‌ల ఖాతాల్లోకి మ‌ళ్లించామ‌ని చెప్పారు. అయితే.. ఇవ‌న్నీ.. ఒక్క జ‌గ‌నే చేశారా? అనేది ప్ర‌శ్న‌. గత ప్ర‌భుత్వాలు కూడా చేశాయ‌ని అంటున్నారు మేధావులు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి నుంచి కిర‌ణ్‌కుమార్ వ‌ర‌కు.. రోశ‌య్య నుంచి చంద్ర‌బాబు వ‌ర‌కు.. చాలా ప‌థ‌కాలు అమ‌లు చేశార‌ని వివ‌రిస్తున్నారు.

వారు కూడా కొన్ని కొన్ని ప‌థ‌కాల‌కు నిధుల‌ను నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాల్లోనే వేశార‌ని.. చెబుతున్నారు. అయితే.. అప్ప‌ట్లో ఇప్పుడున్న‌ట్టు.. ప్ర‌తి ఒక్క‌రికీ బ్యాంకు ఖాతా లేదు. దీంతో ఉన్న‌వారికి మాత్ర‌మే అమ‌లు చేశారు. అయినా.. డిజిట‌ల్ ప్ర‌పంచం పురోగ‌మిస్తున్న నేటి రోజుల్లో.. ఇంకా.. బ్యాంకుల‌కు వెళ్ల‌డం.. డ‌బ్బులు తీసుకోవ‌డం.. అనేకాన్సెప్టు ఉండ‌దు క‌దా! సో.. జ‌గ‌న్ చెబుతున్న‌దానిలో వాస్త‌వం లేద‌నేది.. ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల మాట‌. ఇక‌, సంక్షేమ కార్య‌క్ర‌మాలుకూడా గ‌తంలో ఉన్నాయ‌ని అంటున్నారు.

అంతేకాదు.. గ‌త ప్ర‌భుత్వాలు.. ఒక్క సంక్షేమానికే కాకుండా.. రాష్ట్ర అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇచ్చా య‌ని.. దీంతో రాష్ట్రం కూడా అబివృద్ధి చెందింద‌ని.. చెబుతున్నారు. కానీ.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వంలో మాత్రం కేవ‌లం సంక్షేమం పేరుతో.. అభివృద్ధిని విస్మ‌రిస్తున్నార‌ని.. మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఏం చెప్పినా.. ఎంత చెప్పినా.. జ‌నాలు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌నేది మేధావుల మాట‌. సో.. దీనిని బ‌ట్టి..ఆయన త‌న‌ను తాను మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌నే సూచ‌న‌లువ‌స్తున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.