మైండ్ బ్లోయింగ్ విజువ‌ల్స్‌.. చియాన్ విక్ర‌మ్ ‘ కోబ్రా ‘ ట్రైల‌ర్ చంపేసింది..! (వీడియో)

తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కోబ్రా. యాక్షన్ ఎంటర్టైన్ తెర‌కెక్కిన‌ ఈ సినిమాను సెవెన్ స్టూడియోస్ – రెడ్ జెయింట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.విక్రమ్‌కు జోడిగా కేజిఎఫ్ భామా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. కోబ్రా ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మేక‌ర్స్ రిలీజ్ చేసిన ట్రైల‌ర్లో విజువ‌ల్స్ అదిరిపోయాయి.

Chiyaan Vikram Cobra First Look Poster, Actor Plays 7 Characters

తాజాగా రిలీజ్ అయిన ట్రైల‌ర్లో విక్రమ్ గణిత శాస్త్రవేతగా కనిపించనున్నాడు. ట్రైల‌ర్లో విక్ర‌మ్‌ ఐదు డిఫరెంట్ క్యారెక్టర్ల‌లో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇందులో ఇండియన్ క్రికెట్ టీమ్‌ స్టార్ ప్లేయ‌ర్‌ గా పేరుపొందిన‌ ఇర్ఫాన్ పాఠ‌న్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. మియా జార్జ్- మృణాలిని రవి కీలకపాత్రలోో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.