సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎంత ప్రత్యేకమైన గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన నటనతో, డాన్స్ తో , సేవా గుణంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలోనే కాదు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కూడా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఇకపోతే అతి తక్కువ సినిమాలే చేసినప్పటికీ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశం చేయాలని ఎంతోమంది ఆశాభవం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇదిలా ఉండగా ప్రముఖ సింగర్ అలాగే నటుడు అయిన నోయల్ తనను సూపర్ మ్యాన్ గా మార్చింది ఎన్టీఆర్ అంటూ అసలు విషయం బయట పెట్టాడు. ఇక ఇందుకు గల కారణం ఏమిటో మనము ఒకసారి చదివి తెలుసుకుందాం.ప్రముఖ సింగర్ నోయల్ ఎన్టీఆర్ తో కలిసి నాన్నకు ప్రేమతో సినిమాలో నటించారు. ఇక ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెబుతారు అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ఎన్టీఆర్ టైగర్ అని చెప్పారు. ఇక ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో నాకు మంచి రోల్ లో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా డేట్ లో మరో చిన్న సినిమా డేట్ లో క్లాష్ కావడంతో ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో నటించలేకపోయాను అంటూ నోయల్ వెల్లడించాడు. ఇక ఈ విషయంలో నేను చాలా బాడ్ గా ఫీల్ అయ్యాను.. ఇక తారక్ తో చాలా మెమోరీస్ ఉన్నాయి.. నాన్నకు ప్రేమతో షూటింగ్ సమయంలో కుమారి 21ఎఫ్ ట్రైలర్ కట్ అయింది.. ఎన్టీఆర్ గారు ట్రైలర్ చూసి చాలా బాగా చేశావని మెచ్చుకున్నారు అంటూ నోయల్ తెలిపారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ అలా కామెంట్లు చేయడంతో నేను ఒక్కసారిగా సూపర్ మ్యాన్ అయిపోయాను.. ఇక ఎన్టీఆర్ ఎంత గొప్ప నటులో అంత గొప్ప మనసున్న వ్యక్తి .. బ్యూటిఫుల్ పర్సన్ అంటూ నోయల్ ఎన్టీఆర్ ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. ప్రస్తుతం ఈ మాటలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆ సింగర్ ని సూపర్ మ్యాన్ గా మార్చిన ఎన్టీఆర్.. అసలు విషయం ఇదే..!!
