బిగ్ బ్రేకింగ్: ఎన్టీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం..NTR కూతురు హఠాన్మరణం..!!

తెలుగు ప్రజల గుండె చప్పుడు స్వర్గీయ నందమూరి తారకరామరావు గారి కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కొద్దిసేప్పటి క్రితమే మృతిచెందారు. దీంతో దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనకు తెలిసిందే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక మైన పేజీని లిఖించుకున్నారు రామారావు గారు. నందమూరి తారక రామారావు-బసవతారకం దంపతులకు మొత్తం 11 మంది సంతానం అన్న విషయం మనకు తెలిసిందే. వాళ్లల్లో ఏడుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు.

వారి పేర్లు జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ , లోకేశ్వరి, పురందేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఈ కంఠమనేని ఉమామహేశ్వరి .

బయట పెద్ద గా కనిపించని ఈమె సోమవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె కు గత కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేదు. డాక్టర్ల దగ్గర ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా..ఆమె హెల్ట్ కండీషన్ బాగోకపోవడం వల్ల కొద్ది సేప్పటి క్రితమే ఆమె తుది శ్వాస విడిచారు.

ఆమె మరణ వార్త విన్న నందమూరి కుటుంబ సభ్యులు ..హుటాహుటిన ఆమె నివాసానికి చేరుకున్నారు. ఆమె మృతితో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇప్పటికే ఉమామహేశ్వరి ఇంటికి నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె అయిన ఉమా మహేశ్వరికి చిన్నపటి నుండి చాలా గారాభంగా పెరిగిందట.

ఈమె ఫస్ట్ నరేంద్ర రాజన్ అనే వ్యక్తితిని పెళ్లి చేసుకుంది. కానీ, అతడు చిత్ర హింసలు పెట్టడంతో.. విడాకులు తీసుకుని… తర్వాత కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్‌తో వివాహం జరిపించారు. కంఠమనేని ఉమామహేశ్వరి మరణ వార్త తెలుసుకున్న ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి కలగాల్ని కోరుకుంటున్నారు. ఆమె కుటుంబానికి ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నారు.