అల్లు అర్జున్ మహేష్ బాబుకి పోటీ తగులు కున్నాడా? అనుమానం ఇందుకే?

అల్లు అర్జున్ – మహేష్ బాబు… ఇద్దరు ఇద్దరే. ఓ పెద్ద సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినా, తమకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న నటులు. బేసిగ్గా ఇద్దరికీ పోటీని పెట్టలేము. ఎందుకంటే ఎవరి విషయాల్లో వారే బెస్ట్. నటనలో మహేష్ బాబు బెస్ట్ అయితే, డాన్సులు వేయడంలో అల్లు అర్జున్ తోపు అన్న సంగతి అందరికీ తెలిసినదే. ఇక ఫ్యాన్ బేస్ విషయానికొస్తే ఇద్దరూ తక్కువోలేం కాదు. ఆంధ్ర అమ్మాయిలు మహేష్ కి ఫిదా అయితే, కేరళ కుట్టీలు అల్లు అర్జుని కి పడిపోయారు.

ఇక అసలు విషయాల్లోకి వస్తే, ఏవిషయంలోని పోటీ లేని ఈ ఇద్దరికీ ఇప్పుడు ఓ విషయంలో వార్ మొదలవ్వబోతోంది. తెలుగు స్టార్ హీరోల్లో అత్యధిక కమర్షియల్ యాడ్స్ లో నటించింది ఎవరు.. అంటే ఠక్కున మనకు గుర్తొచ్చేది మహేష్ బాబే. ఆయన తరువాతే ఎవరన్నా. ఓ రకంగా చెప్పుకోవాలంటే మహేష్ బాబుని మినహా యాడ్స్ విషయంలో ఒకటి అరా తప్ప ఇంకెవ్వరికీ యాడ్స్ లేవు. తాజా సర్వే ప్రకారం అల్లు అర్జున్ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు మాదిరిగా యాడ్స్ లో నటించబోతున్నాడంటూ టాక్ వినబడుతోంది.

అవును.. ప్రస్తుతం బన్నీ చేతిలో పలు కంపెనీల ఒప్పందాలు ఉన్నాయి. టాలీవుడ్ లో అత్యధిక యాడ్స్ లో కనిపిస్తున్న హీరోల జాబితాలో అల్లు అర్జున్ ప్రస్తుతం రెండవ స్థానంలో వున్నారు. ముందు ముందు అల్లు అర్జున్ మరిన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకునే అవకాశాలు కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ మొదలుకుని ప్రతి రంగంలో కూడా అల్లు అర్జున్ తన ముద్రను వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో రాబోతున్న రెండేళ్లలో అల్లు అర్జున్ మహేష్ బాబుని మించిపోతాడని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.