నన్ను పెళ్లి చేసుకున్నవాడు భరించలేడు! రోజంతా అదేపనిగా చేయాల్సొస్తుంది: బిగ్ బాస్ బ్యూటీ

బిగ్‌ బాస్‌.. గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్‌ నుంచి దిగుమతి చేసుకున్న కాన్సెప్ట్‌లలో ఇదొకటి. అయితే మిగతా ప్రోగ్రామ్స్ సంగతి అటుంచితే, ఈ షో మాత్రం అటు నిర్వాహకులకు ఇటు అందులో పాత్రలు పోషిస్తున్న వారికి దండిగా డబ్బులు తెచ్చి పెడుతుంది. ఇక మన ప్రేక్షకులు ఎలాగూ ఉండనే వుంటారు ఇలాంటివాటికి. అందువలన ఈ షో ఇండియాలో సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. భారతదేశంలో ప్రారంభమైన ప్రతి భాషలో బిగ్‌ బాస్‌ కాన్సెప్ట్‌ కు మంచి ఆదరణ లభించింది.

ఇకపోతే తెలుగులో 5 సక్సెస్‌ఫుల్‌ సీజన్లను కంప్లీట్‌ చేసుకున్న బిగ్ బాస్ షో ఆరో సీజన్‌ను షురూ చేస్తోంది. మరోవైపు బిగ్‌ బాస్‌ OTT సీజన్‌ కూడా ఒకటి దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సంగతి విదితమే. భాషతో తేడా లేకుండా ఈ బిగ్‌ బాస్‌ షో ఎంతో మందిని సెలబ్రిటీలను చేసింది. ఈ బిగ్‌ బాస్‌ లో పాల్గొని వచ్చిన వారంతా బయట స్టార్లుగా కొనసాగుతున్నారు. అదే హిందీలో అయితే వీళ్లకు మరీ క్రేజ్ ఎక్కువ. ఈ షో నుంచి హీరోలు, హీరోయిన్లు అయిన వారు ఉన్నారు. వీళ్లు ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా క్షణాల్లో వైరల్‌ గా మారుతుంది.

తాజాగా పెళ్లిపై హిందీ బిగ్‌ బాస్ బ్యూటీ అయినటువంటి ‘షెహనాజ్‌ గిల్‌’ ఓ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్‌ తాజాగా వైరల్‌ అవుతున్నాయి. ఈమెకి సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ప్రొపోజ్ చేసాడు. దాని గురించి సదరు యాంకర్ ప్రశ్నించగా… “అతను ప్రపోజల్‌ పెట్టారు.. అయితే ఇంకా బయోడేటా నాకు పంపలేదు. నాతో జీవించడం అంత ఈజీ కాదు. ఎదుటివారు చెప్పేది వినేంత సహనం, ఓపిక నాకు లేదు. 24 గంటలూ నేను మాట్లాడుతూనే ఉంటాను. కాబట్టి నేను ఏది చెబితే అది మీరు వినాలి. మధ్యలో నన్ను పొంగుతూ మాట్లాడుతూ ఉండాలి. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా నాతో ఎక్కువ కాలం ఉండలేరు. దానికి సిద్ధమై రావాలి.” అని చెప్పింది. అయితే ఈ విషయం మీద సోషల్ మీడియాలో ఆమెమీద ట్రోల్స్ జరుగుతోంది.