అభిమానులకు బిగ్ సర్ప్రైజ్..మహేశ్ ఊహించని పిక్ ను షేర్ చేసిన నమ్రత..ఏమున్నాడు రా బాబు..!!

ఓ మై గాడ్… ఏమున్నాడు రా బాబు.. అని అంటున్నారు మహేశ్ బాబు రీసెంట్ పిక్ చూసిన జనాలు. ఎస్.. కొద్దిసేపటి క్రితమే మహేష్ బాబు భార్య నమ్రత అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. నిన్న మొన్నటి వరకు మహేష్ తో గడిపిన ఫారిన్ టూర్ పిక్స్ ను షేర్ చేసిన నమ్రత.. ఇప్పుడు ఆయన అభిమానులకోసం మహేశ్ బాబు ఊహించని పిక్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మహేశ్ బాబు షర్టు లేకుండా ఉండే ఫోటో ని షేర్ చేసి అభిమానులకు కొత్త సర్ప్రైజ్ ఇచ్చింది నమ్రత.

టాలీవుడ్ లోనే హ్యాండ్సమ్ హీరో అయిన మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా కి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా లో మహేశ్ ఇప్పటి వరకు మనం చూడని స్టైల్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలా స్టైలీష్ లుక్ లో ఈ సినిమాలో టూ హాట్ గా సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు రిలీజ్ అయిన మహేష్ బాబు ఫారిన్ టూర్ పిక్స్ అన్ని నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా, మహేష్ బాబు ఎన్ని సినిమాలు చేసిన ఎప్పుడూ కూడా తన షర్టు లేకుండా పిక్ ని షేర్ చేయలేదు. ఎక్కడ కూడా తన బాడీ ని ఎక్స్పోజ్ చేయలేదు.. చూయించలేదు . కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఆయన భార్య నమ్రత మహేష్ బాబు షర్ట్ లెస్ పిక్ ని అభిమానులతో పంచుకుంది. నిజానికి ఇప్పటివరకు మనం మహేష్ బాబుని ఇలా ఈ తరహా లుక్ లో అయితే ఎప్పుడూ చూడలేదు. తాజాగా నమ్రత షేర్ చేసిన మహేష్ స్వీంఅ్ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. స్విమ్ చేస్తూ పూల్ లో చాలా హ్యాండ్సమ్ గా గ్లాసెస్ పెట్టుకొని..యమ హాట్ గా ఉన్నాడు మహేష్ బాబు. ఈ పిక్ చూసిన ఫ్యాన్స్ ఏమున్నాడు రా బాబు..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మహేశ్ షర్ట్ లెస్ పిక్ నెట్టింట టాప్ ట్రెండింగ్ లో ఉంది.