ఆ స్థానాల్లో ‘ఫ్యాన్’ బలం తగ్గట్లేదుగా!

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి…ఇప్పటివరకు వైసీపీకి వన్ సైడ్ గా ఉండే పరిస్తితి ఉంది..కానీ నిదానంగా ఆ పరిస్తితి మారుతూ వస్తుంది…అనూహ్యంగా ప్రతిపక్ష టీడీపీ సైతం బలపడుతూ వస్తుంది…అటు కొన్ని ప్రాంతాల్లో జనసేన కూడా పుంజుకుంటుంది. ఇలాంటి పరిస్తితుల ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల వైసీపీ బలం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా వైసీపీ స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది…అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిన…కాస్త ప్రజా వ్యతిరేకత పెరిగిన సరే వైసీపీ బలం కొన్ని ప్రాంతాల్లో అలాగే ఉంది.

ముఖ్యంగా కొన్ని పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ బలం పెద్దగా తగ్గడం లేదు…ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఆ స్థానాల్లో వైసీపీనే సత్తా చాటేలా ఉంది. అలా వైసీపీ స్ట్రాంగ్ గా ఉన్న పార్లమెంట్ స్థానాలు వచ్చి…అరకు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, కడప, రాజంపేట, నంద్యాల, ఒంగోలు. ఈ స్థానాల్లో వైసీపీ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. అయితే మిగిలిన స్థానాల్లో వైసీపీ బలంగానే ఉంది..కాకపోతే వైసీపీకి పోటీగా టీడీపీ బలపడుతూ వస్తుంది.

కానీ ఈ స్థానాల్లో మాత్రం పూర్తిగా వైసీపీదే పైచేయి అన్నట్లు పరిస్తితి ఉంది…గత ఎన్నికల్లో ఏ స్థానాల్లో వైసీపీ భారీ మెజారిటీలతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో కూడా ఇవే స్థానాల్లో వైసీపీ మళ్ళీ గెలిచేలా ఉంది…గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కాస్త తగ్గిన గెలుపు మాత్రం వైసీపీ వైపే ఉండేలా ఉంది. ఈ స్థానాల్లో టీడీపీ పెద్దగా పుంజుకోలేకపోతుంది. గత ఎన్నికల్లో ఈ 9 స్థానాల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.

ఎన్నికలై మూడేళ్లు దాటిన టీడీపీ పుంజుకోలేదు. కొద్దో గొప్పో ఒంగోలు స్థానంలో టీడీపీకి కాస్త అవకాశం కనిపిస్తోంది…కానీ మిగిలిన స్థానాల్లో వైసీపీ హవానే మళ్ళీ కొనసాగేలా ఉంది.

Share post:

Latest