ఈ సినిమాతో సమంత త్వరలో లేడీ విలన్ గా మారబోతుందా..?

దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా పేర్కొంది సమంత. నాగచైతన్య నుంచి విడాకుల ప్రకటన వెలుబడినప్పటి నుంచి.. తన దృష్టి కేవలం సినిమాలపైనే పెట్టింది. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు కాకుండా విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అభిమానులను బాగా సందడి చేస్తూ వస్తోంది. విడాకుల తర్వాత బోల్డ్ పాత్రలకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉన్నది. ఇక ఈ క్రమంలోనే సమంత విడాకుల తర్వాత పుష్ప సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో బాగా అలరించింది.Samantha Akkineni, Thalapathy Vijay - Sister And Brother?ఈమె బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలను అందుకుంటోంది. మరొకవైపు సమంత విభిన్నమైన పాత్రలు చేయడానికి కూడా సిద్ధమవుతోంది. ఈసారి తను నటించబోయే సినిమాలో విలన్ పాత్రలో చేయడానికి కూడా వెనుకాడడం లేదు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో విజమ్ నటిస్తున్న చిత్రం వారసుడు. ఈ సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక నటిస్తున్నది. ఇక అంతే కాకుండా ఈ సినిమాలో సమంత లేడీ విలన్ పాత్రలో కనిపించబోతోంది అని కోలీవుడ్ మీడియా లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా లో ఫుల్ లెన్త్ విలన్ పాత్రలో సందడి చేయబోతున్నట్లుగా సమాచారం. ఇదివరకే సమంత విక్రమ్ నటించిన 10 చిత్రంలో కొద్దిసేపు నెగిటివ్ పాత్రలో నటించింది. ఇక ప్రస్తుతం విజయ్ సినిమాలో ఏకంగా ఫుల్ లెన్త్ విలన్ పాత్రలో సమంత నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం అభిమానులకు తెలియగానే ఈ సినిమాలో సమంత ఎలా ఉండబోతుందో అంటూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సమంత యశోద, ఖుషి, శాకుంతలం వంటి సినిమాలతో బిజీగా ఉన్నది.