అరెరె..ఈ విషయం ఎలా మర్చిపోయావు బ్రదర్.. విజయ్‌ కామెంట్లు బూమరాంగ్‌ అయ్యాయిగా..!

పాపం విజయ్ దేవరకొండ తెలిసి చేశాడో తెలియక చేశాడొ తెలియదు కానీ..తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్లు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. మామూలుగా కాదు..కొందరు తిట్టుకునేంతలా..మరికొంత మంది కౌంటర్లు వేసేలా..విజయ్ మాటలకు రియాక్ట్ అవుతున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ..తన లెటేస్ట్ చిత్రం లైగర్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో కూడా విజయ్ నటన కు మంచి మార్కులే పడ్డాయి. ఓకే అంత వరకు బాగానే ఉంది. కానీ, మైక్ పట్టుకుని ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు కొత్త అర్ధాలకు తావు తీస్తుంది.

లైగర్ ట్రైలర్ ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ..తనదైన స్లాంగ్ లో..”ఏంటి రా మీరు..ఇంత భీబత్సంగా ఉన్నారు. మీకు నా అయ్య ఎవరో తెల్వదు..నా తాత ఎవరో తెల్వదు..నా సినిమా రిలీజై రెండేళ్లు పైగానే అవుతుంది. పైగా అది చెప్పుకొతగ్గ సినిమాకాదు..అయినా నా సినిమా ట్రైలర్‌కి ఇంత హంగామ..ఇంత రచ్చ ఏందిరా నాయన” అంటూ తన మనసులోని మాటలని చెప్పుకొచ్చాడు. అంతే, ఒక్కసారిగా విజయ్ పై సినీ బడా స్టార్స్ ఫ్యాన్స్ అందరు మండిపడ్దారు. మధ్యలోకి అయ్య,తాతలను ఎందుకు తీసుకొచ్చావు..అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో తాత, తండ్రి పేర్లు చెప్పుకుని వచ్చిన వారు అందరిని నువ్వు అవమానించిన్నట్లే అంటూ ఫైర్ అయ్యారు.

 

నిజానికి విజయ్ మాట్లల్లోని అర్ధం అదే. మీకు మా నాన్న, తాత తెలియదు కానీ నా పై ఇంతటి ప్రేమ నా..అని అర్ధం వచ్చేలా మాట్లాడారు. మిగత హీరోలు ఎవ్వరైతే..స్టేజ్ పై కనిపిస్తే ఫ్యాన్స్ ఊగిపోతారో..అలాంటి వాళ్లని..టార్గెట్ చేసి మాట్లాడిన్నట్లే ఉన్నాయి ఈ మాటలు. అయితే, విజయ్ ఇక్కడ బిగ్ పాయింట్ ని మిస్ అయ్యాడు . విజయ్‌ తండ్రి కూడా దర్శకత్వ శాఖలో పని చేశారు.

ఓకే ఆ విషయాని కూడా పక్కన పెడితే ..విజయ్ తన సొంత తమ్ముడిని తన పలుకబడితో ఇండస్ట్రీలోకి హీరోగా రప్పించాడు. తన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండను వారసత్వంతోనే విజయ్‌ తీసుకొచ్చాడుగా అనేది ఇప్పుడు జనాలు క్వశ్చన్ చేస్తున్నారు. మరి నువ్వు ఇలాంటి వారసత్వ మాటలు మాట్లాడటం కరెక్టెనా అంటూ మండిపడుతున్నారు. కొందరు అయితే విజయ్ కామెంట్లు బూమరాంగ్‌ అయ్యాయిగా..దీనికి ఆన్సర్ చెప్పు బ్రదర్..అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి దీని విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి..?