అంత పెద్ద స్టార్ నా.. నయనతారపై కరణ్ జోహర్ షాకింగ్ కామెంట్స్

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్ కరణ్ జోహర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందిరికీ సుపరిచయమైన వ్యక్తే.. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీతో పాటు అన్ని సినిమా ఇండస్ట్రీలో ఆయన బాగా పాపులర్. ఇతర భాషల సినిమాలను ఆయన బాలీవుడ్ లో విడుదల చేస్తూ ఉంటారు. అందుకే అన్ని సినిమా ఇండస్ట్రీలతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. అలాగే కరణ్ జోహర్ అంటే వివాదాలు కూడా ఉంటాయి.

ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ అనే టాక్ షో కరణ్ జోహార్ చేస్తున్నాడు. ఈ టాక్ షో కొత్త సీజన్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ+హాట్ స్టార్ లో ప్రారంభమైంది. ఈ టాక్ షోకు ఇటీవల బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, టాలీవుడ్ హీరోయిన్ సమంత కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమంత తన పర్సనల్ లైఫ్, సినిమాలకు సంబంధించిన పలు విషయాలు బయటపెట్టింది.

నాగచైతన్యతో విడాకుల గురించి బయటపెట్టింది. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సౌత్ ఇండియాలోనే పెద్ద స్టార్ అయిన నయనతారతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని సమంత తెలిపింది. దీంతో ఆమె పెద్ద స్టార్ అని తాను అనుకోవడం లేదని, తాను అనుకున్న లిస్ట్ లో ఆమె లేదని కరణ్ వ్యాఖ్యానించాడు. ఆ మాటకి షాక్ అయిన సమంత.. ఒక చిన్న స్మైల్ తో సరిపెట్టుకుంది.

నయనతారపై కరణ్ జోహర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు మండిపడుతున్నారు. సౌత్ ఇండియా వాళ్లతో పెట్టుకోవద్దు.. వెళ్లి పనిచూసుకో అంటూ కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక మీ లాంటివారి లిస్టులో నయనతార లాంటి మంచి ఆర్టిస్ట్ పేరు లేకపోవడం మంచిది అంటూ వ్యగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. నయనతార గురించి మీకు తెలుసని, అలాంటి గొప్ప యాక్టర్ లు మీ బాలీవుడ్ లో ఉన్నారా అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సౌత్ ఇండియాలోనే పాపులర్ హీరోయిన్ గా నయనతారకు పేరుంది. సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ ఆమెనే. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో టాప్ హీరోయిన్ గా ఆమె పేరు తెచ్చుకుంది. అన్ని సినిమా ఇండస్ట్రీలలో టాప్ హీరోల సరసన నటించింది.