కర్నూలు కోట మళ్ళీ వైసీపీదే!

ఉమ్మడి కర్నూలు  జిల్లా అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…రెడ్డి సామాజికవర్గం హవా ఎక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో వైసీపీ ఆధిక్యం కొనసాగుతుంది…గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ సత్తా చాటుతూ వస్తుంది…అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా కర్నూలులో వైసీపీ హవా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మళ్ళీ ఇక్కడ వైసీపీనే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని తాజా విశ్లేషణల్లో తెలుస్తోంది.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉన్న విషయం తెలిసిందే. 2014లో 14లో వైసీపీ 11 సీట్లు గెలుచుకోగా, టీడీపీ 3 సీట్లు గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి వైసీపీ 14కి 14 సీట్లు గెలుచుకుంది. టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా వైసీపీ ఆధిక్యం దక్కించుకోవడం ఖాయమని అంటున్నారు. అయితే గత ఎన్నికల మాదిరిగా క్లీన్ స్వీప్ చేయడం కష్టమని తెలుస్తోంది. కానీ మెజారిటీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

 

Group Politics Turns Ugly For YSRCP In Nellore

ప్రస్తుతం జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్తితులని బట్టి చూస్తే కొన్ని స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరిగింది…కానీ జగన్ ఇమేజ్ వైసీపీ ఎమ్మెల్యేలకు ప్లస్. అదే సమయంలో కొన్ని చోట్ల టీడీపీ నేతలకు బలపడే అవకాశం వచ్చిన సరే ఉపయోగించుకోలేదు. దీని వల్ల వైసీపీకే అడ్వాంటేజ్ వస్తుంది.  ఇప్పుడు ఓవరాల్ గాజిల్లాలో రాజకీయ పరిస్తితులని బట్టి చూస్తే…శ్రీశైలం, పాణ్యం, డోన్, నందికొట్కూరు, నంద్యాల, కోడుమూరు, ఆదోని సీట్లలో వైసీపీ లీడ్ లో ఉందని తెలుస్తోంది.

అలాగే బనగానపల్లె, కర్నూలు సిటీ, ఆలూరు, మంత్రాలయం, ఆళ్లగడ్డ, పత్తికొండ, ఎమ్మిగనూరుసీట్లలో టీడీపీకి బలమైన నాయకులు ఉన్నారు…ఈ నియోజకవర్గాల్లో టీడీపీ కాస్త పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. వైసీపీకి పోటీగా టీడీపీ వస్తుంది. కానీ రెడ్డి సామాజికవర్గం హవా ఎక్కువ కాబట్టి…మళ్ళీ జిల్లాలో వైసీపీనే పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.