‘సీఎం’ పవన్: బాబుకు షాక్ తప్పదా?

సీఎం సీఎం సీఎం…పవన్ పాల్గొన్న ప్రతి సభలో వినపడే నినాదాలు. పవన్ ని ఉద్దేశించి..జనసేన శ్రేణులు, అభిమానులు సీఎం సీఎం అంటూ అరుస్తూ ఉంటారు. అంటే పవన్ సీఎం అవ్వాలనేది అభిమానుల కోరిక. కానీ ఆ కోరిక నెరవేరడం అనేది చాలా కష్టమైన పని అనే సంగతి తెలిసిందే. ఎందుకంటే ఏపీలో జనసేనకు బలం పెద్దగా లేదు…వైసీపీ-టీడీపీలకు ధీటుగా జనసేన లేదు. ఏదో 6-7 శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీకి ఉన్నాయి.

మరి ఆ ఓట్లతో పవన్ గెలిచి సీఎం అవ్వడం అనేది జరిగే పని కాదు…అయితే అదంతా గత ఎన్నికల్లో అని ఈ సారి జనసేనకు బలం పెరిగిందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఈ సారి ఖచ్చితంగా పవన్ సీఎం అవుతారని చెబుతున్నారు. అలాగే పొత్తు ఉంటే పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని అటు బీజేపీని, ఇటు టీడీపీని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

అయితే సీఎం అనేది పవన్ నోటి నుంచి ఇప్పటివరకు పెద్దగా రాలేదు..ఆయన ఎప్పటికప్పుడు వైసీపీని గద్దె దింపాలనే మాట్లాడుతున్నారు. అలాగే సింగిల్ గా జగన్ ని గద్దె దింపడం కష్టమని పవన్ కు తెలుసు కాబట్టి..పొత్తుకు ఆప్షన్స్ కూడా ఇచ్చుకున్నారు. కానీ ఏమైందో తెలియదు గాని సడన్ గా పవన్ వాయిస్ మారింది. ఇటీవలే పొత్తు ఎవరితో ఉండదని చెబుతూ వచ్చిన పవన్…ఇప్పుడు సింగిల్ గానే పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే జనసేన బలాన్ని ఇంకా పెంచే పనిలో ఉన్నారు.తమదైన శైలిలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.

అలాగే ఈసారి వైసీపీ లేని రాష్ట్ర ప్రభుత్వం చూస్తామని, అవకాశం జనసేనకు ఇస్తే బలంగా ముందుకువెళ్తామని అంటున్నారు. ముఖ్యమంత్రిని అవుతానో లేదో మీ చేతుల్లో ఉందని,  వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో జనసేన జెండా ఎగరడం ఖాయమని అన్నారు. అయితే ఇప్పటివరకు పవన్ ఎప్పుడు మన ప్రభుత్వం వస్తుందని చెప్పారు గాని..క్లారిటీగా జనసేన ప్రభుత్వం అని చెప్పలేదు..అలాగే సీఎం అవుతాననేది కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు క్లారిటీగా చెప్పేస్తున్నారు. దీని బట్టి చూస్తే పవన్…సోలోగా ముందుకెళ్లి సత్తా చాటాలని అనుకుంటున్నారని తెలుస్తోంది…అంటే టీడీపీతో పొత్తు ఉండదని చెప్పేస్తున్నారు. ఏదేమైనా పవన్…చంద్రబాబుకు షాక్ ఇచ్చేలా ఉన్నారు.