బీజేపీ మళ్ళీ ‘ఒక్కటి’ దాటడం కష్టమేనా!

రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీది ఒక వింత పరిస్తితి…ఒకచోట బలంగా ఉంటే…మరొక చోట చాలా వీక్ గా ఉంది. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని చూస్తుంటే..ఏపీలో కనీసం ఒక్క సీటు అయిన దక్కకపోతుందా? అని బీజేపీ చూసే పరిస్తితి ఉంది. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద బలం లేదు. ఎప్పుడైనా టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగైదు సీట్లు గెలుచుకునే పరిస్తితి తప్ప…సొంతంగా బీజేపీ సత్తా చాటిన సందర్భాలు తక్కువ.  కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఏకంగా బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది.

ఒంటరిగానే బీజేపీ సత్తా చాటింది…అక్కడ నుంచి తెలంగాణలో బీజేపీ సీన్ మారింది…పూర్తిగా అధికార టీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అనే పరిస్తితికి బీజేపీ వచ్చింది…ఉపఎన్నికల్లో గెలవడం..జి‌హెచ్‌ఎం‌సిఎన్నికల్లో సత్తా చాటడంతో బీజేపీ రేసులోకి వచ్చింది. కాంగ్రెస్ ని సైతం పక్కకు తోసి…ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. అంటే తెలంగాణలో బీజేపీ ఏ స్థాయిలో పుంజుకుందో అర్ధం చేసుకోవచ్చు.తెలంగాణలో అలా ఉంటే…ఏపీలోబీజేపీ పరిస్తితి మరీ దారుణంగా ఉంది. అసలు ఏపీలో బీజేపీకి పెద్ద బలం లేదు.

2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగు అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లు గెలుచుకుంది. కానీ 2019 ఎన్నికలోచ్చేసరికి బీజేపీ సింగిల్ గా పోటీ చేసి…ఒక్క సీటు కాదు కదా…ఒక్క శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేదు. అయితే ఇప్పటికీ ఏపీలో బీజేపీ పరిస్తితి అలాగే ఉంది. అక్కడ ఒక్క సీటు కూడా గెలుచుకునే సత్తా బీజేపీకి లేదు. జనసేనతో పొత్తులో ఉన్నాసరే బీజేపీకి గెలుపు అవకాశాలు తక్కువే. ఒకవేళ టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఉంటే..బీజేపీకి రెండు, మూడు సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. లేదంటే బీజేపీకి మళ్ళీ ఒక్క శాతం ఓట్లు వచ్చేలా లేవు. బలంగా ఉన్న వైసీపీ-టీడీపీలని తట్టుకుని బీజేపీ నిలబడటం కష్టం. కాబట్టి పొత్తు ఉంటే బీజేపీ కొన్నిసీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది..లేదంటే మళ్ళీ ఒక్కశాతం ఓట్లు దాటలేదు.